ధిమాక్ ఉందా లేదా? సన్ రైజర్స్ నిర్ణయాలపై ఫ్యాన్స్ ఫైరింగ్

Update: 2022-11-16 05:30 GMT
'సన్' టీవీ మారన్ యాజమాన్యంలోని 'సన్ రైజర్స్ హైదరాబాద్' ఐపీఎల్ ఫ్రాంచైజీ నిర్ణయాలపై ఫ్యాన్స్ భగ్గుమంంటున్నారు. బాగా ఆడేవాళ్లను సడెన్ గా తీసేసి అవమానిస్తున్నారని.. తద్వారా ఆటగాళ్ల మనోధైర్యం కోల్పోయి అసలు ఈ జట్టు తరుఫున బాగా ఆడడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్పట్లో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను ఇలాగే కొన్ని మ్యాచ్ లు ఆడడం లేదని తీసేశారు.అది సన్ రైజర్స్ ను అథ: పాతాళానికి తొక్కేసింది. టీం మొత్తం చతికిలపడి గత ఐపీఎల్ లో అన్ని ఓటుములతో చివరి స్థానాల్లో నిలిచింది. పోనీ కెప్టెన్ గా అనుకున్న కేన్ విలయమ్స్ సన్ కూడా రాణించలేకపోయాడు. దీంతో ఈ 2023 మినీ వేలంలో ఏకంగా సన్ రైజర్స్ కెప్టెన్ అయిన విలయమ్స్ సన్ ను కూడా వద్దనుకొని టీం మేనేజ్ మెంట్ షాకిచ్చింది.

ఐపీఎల్ 2022 మెగా వేలంలో 14 కోట్లతో అట్టిపెట్టుకున్న కెప్టెన్ కేన్ విలయంసన్ ను కూడా తాజాగా వదిలేసి సన్ రైజర్స్ ఏం చేస్తుందో అర్థం కాని రీతిలో వ్యవహరిస్తోంది.

గతంలో డేవిడ్ వార్నర్ ను కూడా ఇలానే తీసేసి షాకిచ్చింది. ఇక రషీద్ ఖాన్ లాంటి మేటి బౌలర్ ను కూడా వదులుకుంది. 2021లో వార్నర్, రషీద్ ను వదిలేసిన సన్ రైజర్స్ ప్రాభవం కోల్పోయింది.

మనీష్ పాండే సెలక్షన్ గురించి డేవిడ్ వార్నర్ మేనేజ్ మెంట్ పై వ్యాఖ్యలు చేయడంతో అతడిని కెప్టెన్సీ నుంచి తీసేసి ఏకంగా జట్టు నుంచే తప్పించారు. ఆ తర్వాత తుదిజట్టులో కూడా లేకుండా చేసి బయటకు పంపారు.వరుసగా 5 సీజన్లలో 500+ రన్స్ చేసి సన్ రైజర్స్ బ్యాటింగ్ భారాన్ని మోసిన డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా 2016లో జట్టుకు కప్ నందించాడు. అయినా వార్నర్ ను అవమానించి జట్టు నుంచి బయటకు సన్ రైజర్స్ పంపారు.   దీంతో అభిమానుల్లో సన్ రైజర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వార్నర్ లాంటి ఆటగాడిని తీసేసినందుకు అందరూ తిట్టిపోశారు.

2018లో విలయంసన్ కు కెప్టెన్సీ ఇచ్చి 14 కోట్లతో గత సారి అతడిని అట్టిపెట్టుకున్న సన్ రైజర్స్ ఇప్పుడు అతడిని వదిలేసి షాకిచ్చింది. గత సీజన్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా విలయంసన్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. బ్యాటర్ గా.. కెప్టెన్ గా విఫలం అయ్యాడు. దీంతో అతడిని వేలానికి వదిలేసి షాకిచ్చింది సన్ రైజర్స్. ఇలా 2020 నుంచి 2022 మధ్యలో వార్నర్, రషీద్, విలయంసన్ లాంటి ప్రపంచ క్లాస్ ఆటగాళ్లను వదిలేసి నిండా మునిగింది సన్ రైజర్స్. అసలు ఈ టీంను నడిపించేవాళ్లపైనే అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News