ఒక ప్రైవేటు పార్టీలో తనకు అత్యంత సన్నిహితులతో కలిసి డ్యాన్స్ వేసిన ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ వివాదంలో చిక్కుకోవటం తెలిసిందే. ఆమె డ్యాన్స్ విధానం చూస్తే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే. అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్న ఆమె.. నిజాయితీగా తాను డ్రింక్ తీసుకున్నానే కానీ.. డ్రగ్స్ తీసుకున్నదే లేదని స్పష్టం చేశారు. అయినప్పటికి ఆమెపై రాజకీయ విమర్శల జోరు తగ్గకపోవటంతో.. తనకు తానుగా డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు.
తాజాగా ఆ రిపోర్టు నెగిటివ్ రావడం.. ఆమెకు క్లీన్ చిట్ గా మారింది. ఇలాంటి వేళ.. ఆమెకు అండగా నిలిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన మహిళలు.. ఆమె మాదిరి డ్యాన్స్ వేస్తూ.. తమ వీడియోల్ని పోస్టు చేస్తున్నారు.
ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ కు అండగా నిలుస్తున్నారు. ఫిన్లాండ్ ప్రధాని మాదిరి స్టెప్పులు చేస్తున్న వారు.. 'ఇప్పుడు మేం కూడా డ్రగ్స్ తీసుకుంటున్నామని మీరు అనేస్తారా? మనమందరం మరింత ఎక్కువగా డ్యాన్స్ చేయాలి. సన్నాకు సంఘీభావంగా నిలుస్తున్నాం' అంటూ మహిళలు పోస్టులతో ఊదరగొట్టేస్తున్నారు.
ప్రధాని సనా మాదిరి స్టెప్పులు వేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనకు తానుగా డ్రగ్స్ టెస్టు చేయించుకోవటం ద్వారా.. తన నిజాయితీని ప్రపంచానికి తెలిసేలా చేసిన ఆమెకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున మహిళలు ముందుకు వస్తున్నారు.
తాజాగా ఫిన్లాండ్ పీఎంవో ప్రకటన జారీ చేస్తూ.. అందరి అనుమానాల్ని తీర్చేందుకు చేయించుకున్న డ్రగ్ టెస్టు రిపోర్టు నెగిటివ్ వచ్చిందని.. ఎలాంటి డ్రగ్స్ అనవాళ్లు కనిపించలేదని పేర్కొన్నారు. ఏమైనా.. అత్యుత్తమ స్థానంలో ఉన్న మహిళను అనవసరంగా బద్నాం చేయటానికి చేసిన ప్రయత్నాలకు చెక్ చెప్పేందుకు వివిధ దేశాలకు చెందిన మహిళలంతా రియాక్టు కావటం అభినందించదగ్గ విషయంగా చెప్పక తప్పదు.