వైఎస్ ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవానికి అనంతపురం జిల్లాకు వచ్చిన సీఎం జగన్ ఆ పథకాన్ని గ్రాండ్ గా ప్రారంభించి వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ పర్యటన వైసీపీ ఎమ్మెల్యే - ఎంపీ - మంత్రికి చేదు అనుభవాన్ని మిగిల్చింది..
ప్రొటోకాల్ సమస్య కారణంగా హెలీక్యాప్టర్ లో వచ్చిన జగన్ ను స్వాగతించడానికి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అనుమతించకపోవడం తెలిసిందే. దీనిపై ఆయన మంత్రి శంకరనారాయణతో పెద్దారెడ్డి వివాదం పెట్టుకున్నారు.
ఇక వైఎస్ ఆర్ కంటి వెలుగు ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి - ఎంపీ గోరంట్ల మాధవ్ కు కూడా చేదు అనుభవం ఎదురైంది. సీఎం జగన్ స్టాల్స్ ను ప్రారంభించే సమయంలో ఆయనతోపాటు కలిసి నడుస్తున్న డిప్యూటీ సీఎం - మంత్రి ఆళ్ల నాని ని సీఎం భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. పక్కకు నెట్టారు. ఇక సీఎంతో పాటు పక్కనే నడవడానికి ప్రయత్నించిన ఎంపీ మాధవ్ కు ఇదే పరిస్థితి ఎదురైందట..
సీఎం భద్రతా సిబ్బంది అత్యుత్సాహం కారణంగా మంత్రి ఆళ్ల నాని - ఎంపీ మాధవ్ ఇబ్బంది పడ్డ సన్నివేశం సీఎం కార్యక్రమంలో చోటుచేసుకుంది.