జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిణతి లేదని గత నాలుగేళ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. పార్ట్ టైం పొలిటిషియన్ లా పవన్ అపుడపుడు బయటకు వచ్చి....ఆవేశపూరిత ప్రసంగాలిచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోతారని ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. ఇక, తాజాగా రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో పవన్ మరోసారి సినీఫక్కీలో ఎమోషనల్ స్పీచ్ దంచేసిన విషయం తెలిసిందే. ఆ సభలో వైసీపీ అధినేత జగన్ పై పవన్ చేసిన అపరిపక్వ వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ పై ఎమ్మెల్సీ ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. జగన్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నాని మండిపడ్డారు. పవన్ మానసిక స్థితి సరిగా లేదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ పై అసత్య ఆరోపణలు ఆపకుంటే పవన్, జనసేనలకు ప్రజలే బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని పవన్ గొప్పలు చెప్పుకుంటారని, కానీ, ఆయన ఏనాడు ఢిల్లీ వెళ్లి పోరాడింది లేదని అన్నారు. చంద్రబాబు పిలవలేదని ఢిల్లీ వెళ్లలేదని పవన్ చెప్పడం విడ్డూరమన్నారు.
చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికే పవన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలున్న లోకేష్...పవన్ కు తమ్ముడెలా అవుతారని నాని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తోన్న జగన్....పవన్ కు కనపడడం లేదని ఎద్దేవా చేశారు. ఉద్ధానం, మూలలంక లో పర్యటించిన పవన్ సాధించిందేమీ లేదని, టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం పవన్ కు లేదని ఎద్దేవా చేశారు. పర్యటనల పేరుతో పవన్, చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. వారసత్వ పరంగా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ వారసత్వ రాజకీయాలపై మాట్లాడడం ఏమిటని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ మరణానంతరం జగన్ ఓదార్పుయాత్ర చేయకుండా కాంగ్రెస్ లో ఉండి ఉంటే సీఎం అయ్యేవారని గులాం నబీ ఆజాద్ చెప్పిన సంగతి పవన్ మరచారని నాని గుర్తు చేశారు. పవన్ నిలకడలేని మనస్తత్వానికి ఆయన మాటలే నిదర్శనమని ఎద్దేవా చేశారు.