ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరాలతో ప్రభుత్వం పర్యవేక్షణ చేయడంపై టిడిపి తీవ్రమైన విమర్శలు చేస్తోంది. కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో తాడేపల్లిలో కృష్ణా కరకట్ట సమీపంలో ఉన్న చంద్రబాబు ఇంటి ప్రాంగణంలోకి కృష్ణా నది నీళ్లు వచ్చిన సంగతి విదితమే. రెండు రోజులుగా ఈ విషయంపై టిడిపి, వైసిపి వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరుగుతోంది. తన ఇంటిని డ్రోన్ కెమెరాలతో వీడియో తీయాల్సిన అవసరం ఏముందని... దీంట్లో ఏదో కుట్ర ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అటు వైసీపీ నేతలు మాత్రం ప్రతిపక్షనేత ఇళ్లు ముంపునకు గురవుతోందని... ఆయన కాపాడుకోవటం తమ బాధ్యతని...అందుకోసమే ఫోటోలు, వీడియోలు తీశామని వైసిపితో పాటు ఏపీ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం కృత్రిమ వరదను క్రియేట్ చేసి... ముందస్తు చర్యలు తీసుకోకుండా కావాలని చంద్రబాబు ఇంటిని ముంపునకు గురి చేసిందని విమర్శించారు.
ఉమా వ్యాఖ్యలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా ఫైర్ అవడంతో పాటు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఉమా మాటలు చూస్తుంటే టీడీపీ నేతలు ఎంతలా దిగజారిపోయారో ? అర్థమవుతోందని అన్నారు. ప్రపంచ స్థాయిలో రాజధాని కడతానని గొప్పలు పోయిన చంద్రబాబు రాజధానిలో కనీసం సెంటు భూమి అయినా కొన్నారా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు నివాసం ఉండేది కూడా అక్రమ నివాసమే అన్న విషయం ఆయనకు తెలుసని.. అందుకే ఆయన వరద వస్తుందని తెలిసి ముందే హైదరాబాద్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలోనే బాబుపై మరో సెటైర్ కూడా ఆళ్ల వేశారు. వచ్చే ఉగాది నుండి జగన్ ప్రభుత్వం ఇల్లు లేనివారికి నివాసం కలిపిస్తుందని దానికి దరఖాస్తు చేసుకోవాలని అయన వ్యంగాస్త్రాలు సంధించారు. మీరు ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే మీ వద్దకు మా వలంటీర్ వచ్చి... సెంటో, సెంటున్నరో స్థలం ఇస్తాడని ఆర్కే విమర్శించారు. మీరు ఎలాగూ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని... మీరు డబ్బులు కట్టకున్నా... మా వంతుగా మేం మాత్రం మీ ఇంటికి రక్షణ కల్పిస్తాం అని ఆర్కే చెప్పారు.