ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు: చంద్రబాబు
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ తరఫున ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గుంటూరు-కృష్నా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీలో ఉన్నారు. అయితే.. ఈయనకు పెద్దగా పోటీలేదు. కీలక ప్రతిపక్షం వైసీపీ పోటీలో లేకపోవడంతో పెద్దగా పోటీ ఉండే అవకాశం లేదు. అయితే.. ఇండిపెండెంట్లు మాత్రం ఒకరిద్దరు బరిలో ఉన్నారు.
అదేవిధంగా ఉభయగోదవరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థే పోటీలో ఉన్నా రు. ఇక్కడ కూడా పోటీ ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ.. చివరి నిమిషంలో మార్పులు జరిగి పోటీ ఏర్పడే ఛాన్స్‌ను కూడా టీడీపీ అధినేత అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నాయకు లతో తాజాగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అంతేకాదు.. ఓవర్ కాన్ఫెడెన్సు పెట్టుకుని గెలిచేస్తాం.. అనే ధీమా వ్యక్తం చేయొద్దని చురకలు అంటించారు.
ప్రతి గ్యాడ్యుయేట్‌ను కలిసి భారీ మెజారిటీ సాధించాలని అభ్యర్థులతోపాటు పార్టీ నేతలకు కూడా చంద్ర బాబు సూచించారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లోనూ గ్యాడ్యుయేట్లు టీడీపీకి అనుకూలంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. ముఖ్యంగా చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దని సూచించారు. ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పని చేయాలని తేల్చి చెప్పారు.
ప్రతి ఒక్క ఓటరును కలుసుకుని కూటమిప్రాధాన్యాలు, ప్రభుత్వ లక్ష్యాలను వివరించాలని చంద్రబాబు తెలిపారు. క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్‌చార్జ్‌లతో పాటు అందరూకలసి కట్టుగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ కమిటీల నేతలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని చంద్రబాబు తేల్చి చెప్పారు.