తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పథకం కోసం ఏపీలో ప్రతిపక్షమైన వైసీపీ ఎమ్మెల్యే ఆరాటం ఏంటి? పైగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఎర్రని ఎండలో ఎందుకు నిలబడటం ఏంటి? ఇంతకు ఎవరా ఎమ్మెల్యే అంటారా. ఆయన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆర్కే వ్యవహారశైలి ఇపుడు తెలుగు రాష్ర్టాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణం అయింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పథకం కోసం ఆర్కే ఎండలో నిలుచున్నారు. అనంతరం ఆ పథకం ఏంటి అనేది తెలుసుకొని ముచ్చటపడిపోయారు. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన రూ.5 భోజనం. ఇపుడు ఆర్కే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి వైసీపీ ఆఫీస్ కు వెళుతుండగా....మండేఎండలో ఒక వ్యక్తి హెల్మెట్ పట్టుకొని జీహెచ్ఎంసీ-హరే కృష్ణ ధార్మిక సంస్ధ నిర్వహిస్తున్న 5 రూ. భోజన కౌంటర్ వద్ద వెయిట్ చేస్తున్నారు. కొందరు ఆయన్ను పరికించి చూడగా...ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. ఏంటి ఎమ్మెల్యేగారు ఇక్కడా అని ఆరాతీస్తే ...తెలంగాణలో రూ.5 భోజనం బాగుందని అన్నారు . తన నియెజకవర్గంలో ఈ ప్రోగ్రాం పెట్టి సొంతంగా పేదలకు భోజనం పెట్టాలని భావిస్తున్నారట... క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకునేందుకు ఇలా ఎర్రని ఎండలో అయినా సిద్ధపడ్డానని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/