తండ్రెవరో తెలుసుకోవాలంటే డీఎన్ ​ఏ టెస్టే ఉత్తమం..!

Update: 2020-11-19 16:10 GMT
భార్య, భర్తల మధ్య వివాహేతర సంబంధం విషయంపై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగినప్పుడు డీఎన్​ఏ టెస్ట్​ చేయిస్తే పిల్లలకు తండ్రి ఎవరో తెలిసిపోతుందని ఆలహాబాద్​ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త నిర్ధారించేందుకు కూడా డీఎన్​ఏ పరీక్ష ఉత్తమమైందని హైకోర్టు పేర్కొన్నది. భార్యలు కూడా తాము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి డీఎన్​ఏ పరీక్ష మంచి అవకాశమని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో ఓ సారి వివాహేతర సంబంధం తప్పుకాదని అలహాబాద్​ కోర్టు వ్యాఖ్యానించింది.

స్త్రీ తనకు ఇష్టమైన వ్యక్తితో శారీరరక సంబంధం కలిగిఉండొచ్చని కూడా చెప్పింది. అయితే ప్రస్తుతం నీలం అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్​పై న్యాయమూర్తి వివేక్​ అగర్వాల్​ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఇదే కోర్టులో యువతీ యువకులు తమకు ఇష్టమైన వాళ్లతో కలిసి ఉండొచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలోనూ కోర్టులు వివాహేతర సంబంధాలపై సంచలన తీర్పులు చెప్పాయి.

స్త్రీ పురుషులు వివాహేతర సంబంధాలు నేరంగా పరిగణించలేమని కోర్టులు పేర్కొన్నాయి. ఇటువంటి తీర్పులపై కొందరు సాంప్రదాయవాదులు తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఇటువంటి తీర్పులు కుటుంబ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయని వారు అభిప్రాయపడ్డారు. సమాజంలో వివాహేతర సంబంధాల వల్లే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని కొందరి వాదన.
Tags:    

Similar News