విడాకుల తర్వాత భార్య, పిల్లల భాద్యత భర్త చూసుకోవాల్సిందే : హైకోర్టు

Update: 2020-11-04 14:10 GMT
మానవ సంబంధాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భార్య, భర్తల మధ్య విడాకుల కేసుకు సంబంధించి కీలక తీర్పును చెప్పింది. ఏదైనా అనుకోని కారణాలతో విడిపోయినప్పటికీ భర్త, భార్య, పిల్లలకు ప్రతినెల భత్యం ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భార్యను సరిగా చూసుకోవడం భర్త నైతిక చట్టపరమైన బాధ్యత అని , కుటుంబ భారం మోయడం భర్త నైతిక, సామాజిక బాధ్యత అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పొందుపరిచింది.

దీనిపై పూర్తి వివరాల్లో కి వెళ్తే .. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన అశ్వని యాదవ్ 29 సెప్టెంబర్ 2015 న జ్యోతి యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. వారి వివాహం సందర్భంగా రూ .15 లక్షల రూపాయలు కట్నం కూడా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. అంత వరకు బాగానే ఉన్న వీరికి కూతురు జన్మించడంతో కష్టాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం తన అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని జ్యోతి తెలిపింది. దీనిపై జనవరి 28, 2019 న, జ్యోతి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు అత్తమామలపై సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్రింద అధీకృత గో వెల్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన ఝాన్సీ ఫ్యామిలీ కోర్టు అశ్వని , జ్యోతిలకు విడాకులు మంజూరు చేసింది. అంతేకాకుండా భార్యకు నెలవారీ భత్యంగా రూ.2500, కుమార్తెకు రూ.1,000 ఇవ్వాలని భర్తను ఝాన్సీ కోర్టు ఆదేశించింది. దీనిపై తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్న భార్యకు భరణం ఇవ్వడానికి భర్త నిరాకరిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషనుపై అలహాబాద్ హైకోర్టు స్పందించింది. భర్త పిటిషన్ ను కొట్టివేస్తూ భార్యను బాగా చూసుకోవడం భర్త నైతిక చట్టపరమైన బాధ్యత అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. భార్య, కుమార్తె నిర్వహణకు నెలకు 3,500 రూపాయలు చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఆదేశాన్ని హైకోర్టు ధ్రువీకరించింది. కుటుంబ కోర్టు ఉత్తర్వుల చెల్లుబాటును సవాలు చేస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
Tags:    

Similar News