సిత్రమైన కేసుగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. మైనార్టీ తీరకుండానే మేజర్ అయిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని.. ఒక బాలుడికి తండ్రి అయ్యాడు. దీనిపై కుర్రాడి తల్లి న్యాయస్థానం తలుపు తట్టింది. దీనిపై జోరుగా వాదనలు జరిగాయి. చివరకు ఈ కేసుకు సంబంధించిన కీలక ఆదేశాన్ని జారీ చేసిందిన అలహాబాద్ హైకోర్టు. రోటీన్ కు భిన్నంగా ఉండే ఈ వింత కేసులో.. హైకోర్టు ఏం చెప్పిందన్న వివరాల్లోకి వెళితే..
ఆజంగఢ్ కు చెందిన ఆ కుర్రాడికి పదహారేళ్లు. అంటే.. చట్టప్రకారం ఇంకా మైనర్. అతగాడు ఒక మేజర్ అమ్మాయిని పెళ్లాడాడు. అది కూడా గతంలోనే. గత ఏడాది సెప్టెంబరు 18న కోర్టు ముందుకు వీరి వివాదం వచ్చింది. కుర్రాడి తల్లి కోర్టును ఆశ్రయించి.. మైనార్టీ తీరని తన కొడుకును పెళ్లి చేసుకుందని.. ఆ పెళ్లి చెల్లుబాటు కాదని పేర్కొంటూ తనకు న్యాయం చేయాలని పేర్కొంది.
దీంతో స్పందించిన న్యాయస్థానం.. మైనర్ బాలుడ్ని తల్లి వెంట వెళ్లమని చెబితే.. అందకు ఆ కుర్రాడు నో అంటే నో చెప్పాడు. తాను తన భార్య వెంటే వెళతానని తేల్చి చెప్పాడు. దీంతో.. కోర్టుకు సిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే.. మైనర్ కుర్రాడి మాట ప్రకారం.. మేజర్ అయిన యువతితో సహజీవనం ఫోక్సో చట్టం ప్రకారం నేరమవుతుంది. అదే సమయంలో కుర్రాడ్ని తల్లితో వెళ్లమంటే వెళ్లనని స్పష్టంగా చెబుతున్నాడు.
దీంతో.. ఆ కుర్రాడికి మైనార్టీ తీరేంత వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్ హోంకు తరలించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేజే మునీర్ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఈ ఆదేశాలు మే 31న ఇచ్చినప్పటికీ.. ఈ కేసు వివరాల్ని రెండు వారాల తర్వాత న్యాయస్థానానికి సంబంధించిన వెబ్ సైట్ లో పొందుపర్చారు. మైనర్ గా ఉండి మేజర్ యువతిని పెళ్లాడటమే కాదు.. వారికి ఒక పిల్లాడు పుట్టిన ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.