జగనగణమన ఇస్లాంకు వ్యతిరేకమా?

Update: 2016-08-08 05:02 GMT
ప్రపంచంలో మరే దేశంలో కనిపించని కొన్ని సిత్రాలు మనదేశంలో కనిపిస్తాయి. దేశానికి తలమానికమైన జాతీయ జెండా.. జాతీయ గీతం విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు కనిపిస్తుంటారు. దేశం ఇచ్చిన స్వేచ్ఛను.. స్వాతంత్ర్యాన్ని ఎంతకు బరితెగిస్తారనటానికి తాజా ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. యూపీలోని ఒక స్కూల్లో జాతీయ గీతమైన జనగణ మనను పాడేందుకు నో చెప్పటం సంచలనంగా మారింది.

ఆగస్టు 15 సందర్భంగా స్కూల్లో జనగణమనను పాడరాదంటూ ఆ స్కూల్ యజమాని తేల్చి చెప్పటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి స్కూల్ మీదా.. ఆ యజమాని మీదా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దేశ తొలి ప్రధాని జన్మస్థలమైన చోటనే ఈ తరహా దారుణ ఘటన తెర మీదకు రావటం. యూపీలోనిసాదియాబాద్ ప్రాంతంలో ఎంఎ కాన్వెంట్ పేరిట ఒక స్కూల్ ఉంది. ఇందులో 330 మంది పిల్లలున్నారు.వీరిలో 130 మంది ముస్లిం పిల్లలు చదువుకుంటున్నారు. జాతీయ గీతం ఇస్లాంకు వ్యతిరేకమని.. ‘భారత భాగ్య విధాత’ అనే పదబంధం ఇస్లాం సిద్ధాంతానికి వ్యతిరేకమని.. ముస్లింలకు భాగ్యవిధాత అల్లానే అని.. అలాంటప్పుడు భారత భాగ్య విధాత అంటూ ఎలా అంటామంటూ స్కూల్ యజమాని జియా-ఉల్-హక్ పిడివాదన చేయటమే కాదు.. తమ స్కూల్లోని టీచర్లను జనగణమన పాడొద్దంటూ స్పష్టం చేశారు.

దీంతో ఒళ్లు మండిన స్కూల్ ప్రిన్సిపల్.. టీచర్లు రెండు రోజుల క్రితం తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారటమే కాదు.. సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారి తీవ్రస్థాయిలో వైరల అవుతోంది. ఈ వ్యవహారంపై  దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో..ఈ ఉదంతంపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Tags:    

Similar News