నది ఒడ్డున నగరం..ప్రపంచమంతా విజయం

Update: 2016-03-21 17:30 GMT
అమరావతి నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు.. పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నలు, నది పక్కన రాజధాని కడితే మునిగిపోదని గ్యారంటీ ఏముందని సందేహాలు.. ఒకటా రెండా ఎన్నో చిక్కుముళ్లు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో పునరాలోచించాలంటూ కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని... అశాస్ర్తీయంగా నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ కేవీపీ ప్రధానికి లేఖ రాశారు.

కేవీపీ ఏం రాశారు.. ఎందుకు రాశారు..? ఆయన ఉద్దేశాలేమిటన్నది పక్కన పెడితే కృష్ణానది ఒడ్డున రాజధాని కట్టడం మంచిదేనని చారిత్రక - వర్తమాన ఆధారాలు చెబుతున్నాయి. నదుల ఒడ్డున నిర్మించిన రాజధానులన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి.  అంతేకాదు.. నదుల ఒడ్డు నుంచి ఇతర ప్రాంతాలకు తరలించిన రాజధానులు దెబ్బతినడంతో పాత ప్లేసుకే తెచ్చిన సందర్భాలూ ఉన్నాయి. యమునా నది ఒడ్డునే రాజధాని ఏంటంటూ మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ తన రాజధానిని ఢిల్లీ నుంచి ఆ నగరానికి 25 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఫతేపూర్‌ సిక్రీకి మార్చాడు. కానీ నీరు లేకపోవడంతో దుర్భిక్షం - కరవు కాటకాలు తలెత్తాయి. రెండు - మూడేళ్ల లోపు మళ్లీ యమునా నది ఒడ్డుకు తన రాజధానిని అక్బర్‌ మార్చినట్లు  చరిత్ర చెబుతుంది.

ఇక విదేశాల్లో చూస్తే... మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ నుంచి పుత్రజయకు మార్చే దిశగా ఆ దేశం చర్యలు తీసుకుంటోంది.   కేవలం నదీ జలాల కోసమే రాజధాని మార్పునకు అక్కడ నిర్ణయం జరిగి నూతన రాజధాని నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. టర్కీ దేశం తన రాజధానిని ఇస్తాంబుల్‌ నుంచి నదీ ఒడ్డున ఉన్న నగరానికి మార్చేందుకు సన్నద్ధమవుతోంది.  ప్రాచీన కాలం నుంచి చూస్తే నీరుంటేనే రాజ్యం.. రాజధానులున్నాయి. రాజ్యంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి - వాతావరణం - నీటి కోసం నదులపైనే రాజులు ఆధారపడ్డారు. రాచరికం ముగిసి ప్రజా పాలన ఏర్పాటైన తర్వాత కూడా నదులు - సముద్రాలే రాజధానులకు కీలకంగా మారాయి. ప్రపంచంలో అతి ప్రాచీన నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయి. ఈజిప్టు- నైలునది ఒడ్డున - మోసపటోమియా-ఇరాన్‌ - సింధు- సింధునది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు, పక్కనున్న నదులు

- లండన్(బ్రిటన్‌).. థేమ్స్‌ నది ఒడ్డున ఉంది.

- బీజింగ్‌ (చైనా)... జియాంగ్‌ జీ నది

- టోక్యో(జపాన్).. ఒషిరా నది

- న్యూయార్క్‌(అమెరికా).. సెయింట్‌ లూయిస్‌ నది

- వాటికన్‌ సిటీ.. సైబర్‌ నది ఒడ్డున

- బెర్లిన్(జర్మనీ).. ఎల్‌బీ రివర్‌

- మ్యాడ్రిడ్(స్పెయిన్).. తేజో రివర్‌

- బెర్న్‌.. రైన్‌ నది

- మాస్కో(రష్యా).. మసకా

- ప్యారిస్‌(ఫ్రాన్సు).. స్క్వాన్‌ నది

- కెనడా రాజధాని అట్టవా పీస్‌ నది

- అమెరికాలోని  అట్లాంటా - డెట్రాయిట్‌ - బోస్టన్‌ - లాస్‌ ఏంజిల్స్‌ - శాన్‌ ఫ్రాన్సిస్కోలు మిస్సోరి - కొలరాడో నదుల ఒడ్డునే ఉన్నాయి.

ఇక మన దేశంలో... యమునా నది ఒడ్డున దేశ రాజధాని దిల్లీ ఏర్పడింది. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌ కతా బ్రహ్మపుత్ర - గంగానది పరివాహక ప్రాంతంలో - బిహార్‌ రాజధాని పాట్నా గంగానది ఒడ్డున - గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ సబర్మతి నది ఒడ్డున ఏర్పాటయ్యాయి. మహరాష్ట్ర-ముంబయి - తమిళనాడు-చెన్నైలు కూడా నదీ ఒడ్డునే ఉన్నాయి. రాజధానుల పక్కనే నదులుంటే స్వచ్ఛమైన గాలి ప్రజలకు అంది వారు ఆరోగ్యవంతంగా జీవిస్తారని, దుర్భిక్షం ఉండదనే భావన ప్రాచీనకాలం నుంచి ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. భవిష్యత్తులో ప్రపంచ దృష్టిని ఆకర్షించే నగరంగా అమరావతి మారేందుకు కృష్ణమ్మ కారణమవుతుందనే విశ్వాసంతో ప్రభుత్వముంది.

-- గరుడ
Tags:    

Similar News