పబ్లిక్ గా రాహుల్ ద్రావిడ్ కు సారీ చెప్పిన అలెన్ డొనాల్డ్.. కారణం అదే

Update: 2022-12-16 07:30 GMT
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. భారత్‌పై మొదటి టెస్ట్ విజయం కోసం బంగ్లాదేశ్ ప్రయత్నిస్తూ తడబడుతోంది. ఇరు జట్లూ తొలి టెస్టులో పోరాడుతున్నాయి. అయితే మెన్ ఇన్ బ్లూ  ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం బంగ్లాదేశ్ పై రెండు టెస్టులు గెలవాలని ప్లాన్ చేశారు. అయితే బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన సందర్భంగా ఇరు జట్ల కోచ్‌లు రాహుల్ ద్రావిడ్, అలెన్ డొనాల్డ్ లు తమ జీవితంలో జరిగిన ఒక గొడవకు సంబంధించిన విషయాన్ని బయటపెట్టారు.

బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ అలన్ డొనాల్డ్ 1997లో డర్బన్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే సందర్భంగా జరిగిన సంఘటనపై భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. 1997లో జరిగిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లో డోనాల్డ్ మ్యాచ్ సందర్భంగా ద్రవిడ్‌ను స్లెడ్జింగ్ చేసి తిట్టిపోశాడు.  మ్యాచ్ సందర్భంగా జరిగిన దారుణమైన ఘటనకు ద్రవిడ్‌కు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు డొనాల్డ్ చెప్పాడు. "డర్బన్‌లో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక దారుణమైన సంఘటన జరిగింది.

ద్రవిడ్ మరియు సచిన్ మమ్మల్ని  ఉతిరికారేస్తూ బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. నేను కొంచెం అసహనంతో అప్పుడు పరిధి దాటాను. రాహుల్ ద్రావిడ్ పై నోరుపారేసుకొని తిట్టాను.  రాహుల్ ద్రవిడ్‌పై నాకు పెద్ద గౌరవం తప్ప మరేమీ లేదు. రాహుల్‌తో కూర్చోవడానికి నేను ఇష్టపడతాను. డిన్నర్ కోసం బయటకు వెళ్లి, ఆ రోజు జరిగిన దాని గురించి  అతనిని క్షమించాలని కోరుతున్నాను. కాబట్టి రాహుల్, మీరు వింటున్నట్లయితే, నేను మీతో రాత్రిపూట డిన్నర్ కు రావడానికి ఇష్టపడతాను" అని డోనాల్డ్ ఇంటర్వ్యూలో చెప్పారు.

- ద్రవిడ్ రియాక్షన్ భారత ప్రధాన కోచ్‌కు డొనాల్డ్ క్షమాపణలు చెబుతున్న వీడియో వైరల్ కావడంతో   తన మాజీ ప్రత్యర్థి ఆటగాడితో కలిసి డిన్నర్‌కు వెళ్లాలనుకుంటున్నారా అని ద్రవిడ్‌ను విలేకరులు అడిగారు. ద్రవిడ్ దానికి స్పందించారు. "ఖచ్చితంగా అవును. నేను దాని కోసం ఎదురు చూస్తున్నాను, బిల్లు అతను చెల్లిస్తాడా" అని ద్రవిడ్ సరదాగా చెప్పాడు. ముఖ్యంగా ఈ సంఘటనకు డోనాల్డ్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, అలాంటివి ఆటలో భాగం అని.. అది ఎప్పుడో మరిచిపోయాను అని భారత కోచ్ ద్రావిడ్ బదులిచ్చాడు.

ఈ ఘటన 25 ఏళ్ల క్రితం 1997లో భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు ముక్కోణపు సిరీస్‌లో ఆడుతుండగా జరిగింది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు వర్షం అంతరాయంతో సిరీస్ ఫైనల్‌లో తలపడ్డాయి. సౌతాఫ్రికా 278/8 స్కోరు చేయడంతో మ్యాచ్ నిర్ణీత రోజున జరగలేదు. రిజర్వ్ డే రోజున ఆడబడింది.

వర్షం మరోసారి కురిపించడంతో భారత్‌కు 40 ఓవర్లలో 252 పరుగుల సవరించిన లక్ష్యాన్ని అందించారు. ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ సౌతాఫ్రికా బౌలర్లపై దాడికి దిగారు. ద్రావిడ్ దూకుడు ఆడడంతో డొనాల్డ్ నాడు తిట్టిపోశాడు. ఇప్పటికీ ద్రావిడ్ కు బంగ్లా పర్యటనలో సారీ చెప్పాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Tags:    

Similar News