కేటీఆర్. తెలుగు రాష్ర్టాల రాజకీయాల పరంగానే కాదు సినీ, సీమాంధ్ర నాయకుల్లో పరిచయం అక్కర్లేని పేరు. అల్లు అరవింద్ - ప్రముఖ నిర్మాత - మెగాస్టార్ చిరంజీవి బావమరిది. వీళ్లిద్దరు సమావేశం అయ్యారు. అదికూడా అసెంబ్లీ వేదికగా! తెలంగాణ మంత్రి - సీఎం కేసీఆర్ తనయుడితో అల్లు వారి వారసుడు భేటీకి ఏపీ మంత్రి ప్రత్యక్షంగా వెంట ఉండటం ఇంకా విశేషం.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఐటీ మంత్రి కేటీఆర్ ను అసెంబ్లీలో శనివారం ఉదయం అల్లు అరవింద్ కలిశారు. అసెంబ్లీ సమావేశం ఉదయం పదిగంటలకు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేటీఆర్ ను కలిసేందుకు అల్లు అరవింద్ ఆ సమాయానికంటే ముందే అసెంబ్లీకి వెళ్లారు. ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అల్లు అరవింద్ ను వెంటబెట్టుకొని వెళ్లి కేటీఆర్ తో సమావేశం ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా తమ ఇంట్లో జరుగుతున్న వివాహానికి హాజరుకావాల్సిందిగా అల్లు అరవింద్ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. ఈ వివాహ ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి తప్పకుండా వస్తానని చెప్పినట్లు సమాచారం.