అల్లు అర్జున్ కోర్టు మెట్లెక్కారు

Update: 2016-01-04 13:09 GMT
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కోర్టు మెట్లు ఎక్కారు. రంగారెడ్డి జిల్లా కోర్టుకు అల్లు అర్జున్ వ్య‌క్తిగ‌తంగా హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్‌ లోని భూ వివాదంలో ఆయన కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో 2009లో అల్లు అర్జున్‌ కుటుంబ సభ్యులపై రాహుల్‌ దేవ్‌ అనే వ్యక్తి కేసు వేశారు.

దాదాపు ఆరేళ్లుగా అల్లు అర్జున్‌-రాహుల్ దేవ్‌ ల ఈ స్థ‌లం వివాదం నానుతోంది. ఈ రోజు జ‌రిగిన‌ లోక్‌ అదాలత్‌ లో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. పూర్తి వివ‌రాలు రావాల్సి ఉంది. కోర్టుకు వచ్చిన  అల్లు అర్జున్‌ ను చూసేందుకు లాయర్లు - అక్క‌డే ఉన్న ప‌లువురు ఉత్సుకత ప్రదర్శించారు
Tags:    

Similar News