బ‌న్నీ మామకు టీఆర్ ఎస్‌ లో షాకులే..షాకులు

Update: 2015-12-15 16:36 GMT
స్టైలీష్‌ స్టార్ అల్లు అర్జున్ మామ చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డికి అధికార టీఆర్ ఎస్ పార్టీలో షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. హైద‌రాబాద్‌ లో పేరున్న‌ విద్యాసంస్థ‌ల‌కు అధిప‌తి అయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పోటీచేసి టీడీపీ అభ్య‌ర్థి మంచిరెడ్డి కిష‌న్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే త‌ర్వాత కిష‌న్‌ రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరడంతో చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డికి పార్టీలో గుర్తింపు లేకుండా పోయింది. సౌమ్యుడిగా పేరున్న చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి మంచిరెడ్డి దూకుడు ముందు ఆగ‌లేక‌పోయార‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డికి సంబంధించిన ఓ అన‌ధికార నిర్మాణాన్ని జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేయ‌డం ఇప్పుడు అధికార పార్టీలో పెద్ద హాట్ టాపిక్‌ గా మారింది. జీహెచ్ ఎంసీ అధికారులు అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు నాయ‌కుల నిర్మాణాలు కూడా కూల్చే విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే వారికి ముందుగానే ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత విష‌యంలో అధికారులు టీఆర్ ఎస్ నాయ‌కుల‌కు కొమ్ము కాస్తున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు సైతం విమ‌ర్శ‌లు చేశాయి. అయితే ఇప్పుడు కేవ‌లం చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి విష‌యంలో ఇలా చేయ‌డంతో ఆయ‌న కూడా షాక్‌ కు గురైన‌ట్టు తెలుస్తోంది.

అయితే దీనిపై గ్రేట‌ర్ అధికారుల వాద‌న ఎలా ఉందంటే ముందుగా ఈ ఇంట్లో ఉంటున్న వారికి స‌మాచారం ఇచ్చాకే ఈ అక్ర‌మ నిర్మాణాన్ని  కూల్చివేశామని చెపుతుండ‌గా.... అసలు తనకు ఈ నిర్మాణం కూల్చివేత విష‌య‌మై ఎలాంటి నోటీసులు రాలేదంటూ చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ ఎంసీలోని కీలక అధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా బ‌న్నీ మామ‌కు అధికార‌పార్టీలో అటు పొలిటికల్‌ గాను..ఇటు వ్య‌క్తిగ‌తంగాను షాకుల మీద షాకులు త‌గులుతున్నాయ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News