టీఆర్ ఎస్ కారు ఇప్పుడు వలసవచ్చిన నాయకులతో బాగా టైట్ అయ్యింది. కేసీఆర్ ప్రజాకర్షక పథకాలతో దూసుకుపోతుండడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ప పార్టీ బలహీన పడడంతో ఇబ్బడిముబ్బడిగా నాయకులు వచ్చి టీఆర్ ఎస్ లో చేరుతున్నారు. తాజాగా హైదరాబాద్ కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న దానం నాగేందర్ టీఆర్ ఎస్ లో చేరారు. ఆయన చేరికతో ఇప్పుడు కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఈయనకు ఎక్కడ టిక్కెట్ ఇస్తారనే విషయం ఇప్పుడు టీఆర్ ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పుడు గులాబీ పార్టలో ఖైరతాబాద్ సీటు బాగా కాస్లీ అయిపోయింది. ఈ స్థానంలో టిక్కెట్ కోసం దానం నాగేందర్ - కార్పొరేటర్లు విజయారెడ్డి - కే కేశవరావు కూతురు విజయలక్ష్మీ - మన్నె గోవర్ధన్ రెడ్డిలు ముందు వరుసలో ఉన్నారు. వీరంతా గతంలో వేరే పార్టీలో ఉండి ప్రత్యర్థులుగా పోటీచేశారు. దానం కాంగ్రెస్ నుంచి - విజయారెడ్డి వైసీపీ నుంచి - టీఆర్ ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి బరిలో దిగారు. ఈ ముగ్గురు నువ్వా నేనా అన్నట్టు కత్తులు దూసుకున్నారు. కానీ తర్వాత అందరూ టీఆర్ ఎస్ లో చేరడంతో ఇప్పుడు ఖైరతాబాద్ సీటు ఎవరికి ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. దానం ఖైరతాబాద్ సీటుపై కన్నేయడంతో ఆసక్తి నెలకొంది.
ఇక సినీ నటుడు అల్లు అర్జున్ మామ కూడా టీఆర్ ఎస్ లో కీలక నేతగా ఉన్నారు. ఆయన ఇబ్రహీంపట్నం నేత. కానీ అక్కడ టీఆర్ ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో తాను నివాసం ఉంటున్న ఖైరతాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సినీ రంగంతో మంచి పరిచయాలుండడంతో తాను గెలుస్తానని.. విద్యాసంస్థల అధినేతగా తనకు మంచి పరిచయాలున్నాయని చెబుతున్నాడు. అధిష్టానానికి కూడా విన్నవించాడట.. ఇలా ఖైరతాబాద్ సీటు కోసం అల్లు అర్జున్ మామతో పాటు హేమా హేమీలు పోటీపడుతున్నారు. చూడాలి మరి ఈ హాట్ సీటు ఎవరికి దక్కుతుందో..