ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఎంత అంటే చాలా అని చెప్పాలి. దాన్ని శాసనసభలో సీట్ల రూపంలోనో లేక ఎన్నికల్లో ఓట్ల రూపంలోనో లెక్క వేసి చూస్తే అసలు లాభం లేదు. అంతకు మించి అని అర్ధం చేసుకోవాలి. అందుకే ఏపీలో మూడు ప్రధాన పార్టీలు, ప్రాంతీయ రాజకీయ నేతలు బీజేపీ చుట్టూ గట్టిగా తిరుగుతున్నారు. ఇక బీజేపీ కూడా తన రాజకీయ అవసరాల కోసం అన్నట్లుగా ఎవరినీ దూరం చేసుకోకుండా ఎవరికీ దగ్గర కాకుండా తన గేం తాను ఆడుతోంది.
అందులో భాగమే అర్జంటుగా పవన్ కి మోడీ అపాయింట్మెంట్ దొరికింది. మోడీతో భేటీ కోసం పవన్ చాలా కాలంగా ఎదురుచూసి విసిగి వేసారిపోయారు. ఇపుడు ఆయన తన దారి తాను చూసుకుంటున్న వేళ కమలనాధులు కరిగి అర్జంటుగా మోడీతో పవన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏమి తేలుస్తారు, ఏమి చర్చిస్తారు అంటే ఏమి జరిగినా అంతిమంగా బీజేపీకి లాభం ఉండేలాగానే ఈ భేటీ సాగుతుంది అన్నది నిజం అంటున్నారు.
ఇక పవన్ తో ప్రధాని మోడీ భేటీ జరిగితే మరి వైసీపీకి అది షాకింగ్ పరిణామం కదా. వైసీపీ గుస్సా అవుతుంది కదా. మరి కేంద్ర స్థాయిలో వైసీపీ మద్దతు కావాలి కదా. వైసీపీ విషయంలో బీజేపీ ఆలోచనలు ముందు ముందు ఎలా ఉన్నా ఇప్పటికైతే మాత్రం సడెన్ గా దూరం చేసుకునే అవకాశాలు కానీ అవసరాలు కానీ లేవు.
అందుకే మోడీతో జగన్ భేటీకి కూడా రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. బహుశా అది ఈ రోజు రాత్రి కానీ లేక 12న్ ఉదయం ఎర్లీ మార్నింగ్ కానీ ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం అవుతారు అని చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి పాలనాపరమైన అంశాలను జగన్ చర్చించడంతో పాటుగా రాజకీయ విషయాలు కూడా చర్చిస్తారు అని అంటున్నారు. వైసీపీకి కావాల్సింది టీడీపీని బీజేపీ దూరం పెట్టడం, పవన్ బీజేపీ వైపు వచ్చినా వారికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఏపీకి సంబంధించి 2014 పొత్తు రిపీట్ కాకూడదు, అంటే బీజేపీ టీడీపీ జనసేన కలసికట్టుగా రాకూడదు.
ఈ రకమైన రాజకీయ అజెండాతో వైసీపీ ఉంది. అందువల్ల వైసీపీ తాము చెప్పాలనుకుంటున్నది కేంద్ర బీజేపీ నాయకత్వానికి చెబుతుంది అని అంటున్నారు. 2024 ఎన్నికల తరువాత కూడా మోడీకి బేషరతు మద్దతు కొనసాగించడానికి వైసీపీకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ విషయాన్నే మరో మారు ప్రధాని తో భేటీలో జగన్ చెబుతారా అన్నదే చర్చగా ఉంది.
ఇక బీజేపీ విషయానికి వస్తే తమ ముందు ఉన్న అన్ని అవకాశాలూ వాడుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో బలపడడమే కాకుండా కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడం ఎలా అన్న అజెండాతోనే ముందుకు సగుతుంది అని అంటున్నారు. సో మోడీ కానీ బీజేపీ కానీ ఎక్కడా బయటపడకుండానే అటు జగన్ అయినా ఇటు పవన్ అయినా వారితో బాలన్స్ చేసుకుంటూ తమ టార్గెట్ ని రీచ్ అయ్యేలా బాటలు వేసుకుంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.