ప్రకాశం జిల్లా టిడిపి సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని ఆయన ఈ పిటిషన్ వేయడం విశేషం. ఇందులో కారణంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు... రిటర్నింగ్ అధికారిని సైతం ప్రతివాదులుగా పేర్కొన్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసిన కరణం బలరాం వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై 17 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలిచిన బలరాం ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్లో పూర్తి వాస్తవాలు వెల్లడించలేదని ఆమంచి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం ఆమంచి మంగళవారం మీడియాకు విడుదల చేశారు. బలరాం తన నామినేషన్ పత్రంలో తనకు ఒక భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు చూపించారని... అయితే వాస్తవంగా ఆయనకు మరో భార్యతో పాటు మరో అమ్మాయి కూడా ఉందని చెప్పారు. 1985లోనే కరణం కాట్రగడ్డ ప్రసూనను వివాహం హం చేసుకున్నారని.. వీరి వివాహం శ్రీశైలంలో జరిగిందని ఆయన తెలిపారు. ఈ దంపతులకు 1989లో అంబికా కృష్ణ అనే అమ్మాయి హైదరాబాద్ లోని సెయింట్ థెరెసా ఆసుపత్రిలో జన్మించిందని కూడా ఆమంచి మీడియాకు తెలిపారు.
అంబికా కృష్ణ పదో తరగతి సర్టిఫికెట్ తో పాటు... ఆమె ఆధార్ కార్డులోనూ తండ్రి పేరు కరణం బలరామకృష్ణమూర్తి అని ఉందని... ఆమె అన్నప్రాసనతో పాటు... పుట్టినరోజు వేడుకల్లో సైతం మార్టూరులోని తన బంధువులతో కలిసి కరణం ఎన్నోసార్లు పాల్గొన్నారని కూడా ఆమంచి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఆయన మీడియాకు విడుదల చేశారు. అంబిక తన కూతురు కాదని ఎలాంటి పరీక్ష అయినా బలరాం సిద్ధమేనా ? అని కూడా ఆ మంచి సవాల్ విసిరారు. ఫోరెన్సిక్... డిఎన్ ఏ.... వంటి సైంటిఫిక్ పరీక్షలకు కూడా అంబిక సిద్ధంగానే ఉందని ఆయన తెలిపారు.
ఇందుకు సంబంధించి ఆమంచి మొత్తం 7వేల పేజీలతో కూడిన ఆధారాలు హైకోర్టుకు సమర్పించినట్టు చెప్పారు. ఇక కాట్రగడ్డ ప్రసూన గతంలో టీడీపీ నుంచి సనత్ నగర్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఆమె కుమార్తే ఈ అంబికా కృష్ణ అని ఆమంచి చెపుతున్నారు. ఆమంచి హైకోర్టులో వేసిన ఫిటిషన్‌లో ఆమె కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ రైతుఉద్యమ నాయకుడు, సీనియర్ పార్లమెంటేరియన్ ఎన్జీ.రంగాకు ప్రసూన దగ్గరి బంధువు అవుతారు. మరి ఈ కేసులో ఆమంచి ఆధారాలు పక్కగా ఉంటే బలరాం ఇబ్బందుల్లో పడడం ఖాయం.