ఏపీ హైకోర్టు జడ్జీలు వారి తీర్పులపై అప్పట్లో వైసీపీ నేతలు, కొందరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు స్వయంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ విచారణను తోసిపుచ్చి ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులను వైసీపీ ప్రజాప్రతినిధులపై కేసులు కూడా నమోదు చేసింది.
. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు కూడా జడ్జీలను దూషించిన కేసులో సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో న్యాయస్థానానికి దురుద్ధేశాలను ఆపాదిస్తూ.. న్యాయమూర్తులను దూషిస్తూ.. వారిని ముక్కులుగా నరకాలి అని హెచ్చరించారనే ఆరోపణలు ఈయన ఎదుర్కొన్నారు. ఈనెల 6న సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఏపీ కోర్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ఈనెల 6న విశాఖలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఆమంచి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కాలేనని.. తదుపరి విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐని కోరినట్టు తెలిసింది.
సోషల్ మీడియాలో జడ్జీలను దూషించిన వారిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 49 మందికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేశారు. వీరిలో అధికార పార్టీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. జడ్జిలను దూషించిన కేసులో ఇప్పటికే వైసీపీ అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ పై మాత్రమే కేసులు కాగా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకు సీబీఐ పిలుపు రావడం చర్చనీయాంశమైంది.