సీబీఐ విచారణకు ఆమంచి.. ఏం చెప్పాడంటే?

Update: 2021-02-12 13:04 GMT
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు కూడా జడ్జీలను దూషించిన కేసులో సీబీఐ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు.  గతంలో న్యాయస్థానానికి దురుద్ధేశాలను ఆపాదిస్తూ.. న్యాయమూర్తులను దూషిస్తూ.. హెచ్చరించారనే ఆరోపణలు ఈయన ఎదుర్కొన్నారు. ఈనెల 6న సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  

ఏపీ కోర్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6న విశాఖలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఆమంచి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కాలేనని.. తదుపరి విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐని కోరినట్టు తెలిసింది.

తాజాగా ఈరోజు సీబీఐ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమంచి 'నేను కుట్రపూరితంగా.. పార్టీ ప్రేరేపితంగా మాట్లాడలేదు. ప్రజల అభిప్రాయమే చెప్పాను. కోర్టులపై పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది. రాజ్యాంగ పరిధిని మించి నా వ్యాఖ్యలు ఉన్నాయంటే వెనక్కి తీసుకుంటా' అని చెప్పారు.
Tags:    

Similar News