పెద్దాయన ఇంటికి జయ..అంతా ఓకేనట!

Update: 2017-01-02 13:50 GMT
స‌మాజ్ వాదీ పార్టీలో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ ర‌థ‌సార‌థి అయిన ములాయం సింగ్‌ కు ఇర‌కాటం ఎదుర‌య్యే ప‌రిస్థితుల్లో పెద్దాయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని - అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని  ములాయం సింగ్ స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు.. తననెవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.

సమాజ్‌ వాదీ పార్టీ ఎన్నికల చిహ్నం తాను తయారు చేసిందేనని చెప్పిన ములాయంసింగ్ తనకు మద్దతుగా ఉంటున్న మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడిపై జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన ములాయం తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ములాయం సన్నిహితుడు అమర్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. లండన్‌ నుంచి హుటాహుటిన వచ్చిన ఆయన నేరుగా ములాయం నివాసానికి చేరుకున్నారు. అయితే ములాయం స‌న్నిహితురాలైన జయప్రద కూడా హాజరుకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కష్టకాలంలో నేతాజీకి అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే జ‌య‌ప్ర‌ద ఇంత హుటాహుటిన వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని గతేడాది ప్రకటించిన జయప్రద.. సమాజ్‌ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News