చేతబడులు - క్షుద్రవిద్యలు - వాస్తు లాంటి అంశాలను రాజకీయ నాయకులు బలంగా నమ్ముతారనేది ఇప్పటిమాట కాదు. అలాంటి మూఢ నమ్మకాలపై నేతలకు ఎక్కువ ఆసక్తి ఉంటుందనడానికి బీహార్ ఎన్నికల సమయంలో సీఎం నితీశ్ కుమార్ ఉదంతం - తదితర సంఘటనలు పలు సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి కూడా. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ (ఎస్పీ) పార్టీలో నెలకొన్న తీవ్ర సంక్షోభానికి చేతబడి - క్షుద్రశక్తుల ప్రయోగమే కారణమట. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ - ములాయంసింగ్ యాదవ్ ను నాశనం చేయడానికి ఇంటి శత్రువులైన పార్టీ అధినేత రెండో భార్య సాధన - శివపాల్ చేతబడి - క్షుద్రశక్తులను ప్రయోగించారని స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ లేఖ రాశారని జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.
'రెండేళ్ల నుంచి ములాయంపై మంత్ర తంత్రాలు చేస్తున్నారు. సైఫాయ్ లోని శివ్ పాల్ ఇంట్లో ఓ ట్రాక్టర్ నిండా కొబ్బరికాయలు ఉన్నాయి. అఖిలేశ్ కు చెడు తలపెట్టడానికి - ములాయంను వశపరుచుకోవడానికి ఈ విద్యలు ప్రయోగిస్తున్నారు' అని రాంగోపాల్ యాదవ్ లేఖలో పేర్కొన్నారని ఆ పత్రిక తెలిపింది. మూడేళ్ల తర్వాత సీఎంను చేస్తానని ఇచ్చిన మాటను ములాయం తప్పినందుకే శివపాల్ చేతబడి చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ నోరు విప్పారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ బాబాయి రాంగోపాల్ యాదవ్ నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. తనకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలువనున్నట్లు మీడియా కు తెలిపారు. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాంగోపాల్ బెదిరింపుల ప్రకటనతో తాను భయపడాల్సి వస్తున్నదని అన్నారు. యూ పీ సీఎం అఖిలేశ్ కు - ఎస్పీ యూపీ చీఫ్ శివ్ పాల్ మధ్య విభేదాలకు తాను బాధ్యుడినన్న వార్తలను తోసిపుచ్చారు. తనను బ్రోకర్ (దలాల్) అని యూపీ సీఎం అఖిలేశ్ చేసిన వ్యాఖ్య మనస్తాపానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. డింపుల్‌తో అఖిలేశ్ పెళ్లికి ములాయం సహా మొత్తం కుటుంబం వ్యతిరేకంగా ఉన్నా.. తానొక్కడినే మద్దతుగా నిలిచానని గుర్తుచేశారు. అఖిలేశ్ పెళ్లి ఫొటోల్లో తాను లేకపోవడంపై స్పందిస్తూ అక్కడ ఈ బ్రోకర్ లేడు అని భావోద్వేగ వ్యాఖ్య చేశారు. నేను సీఎం అఖిలేశ్ తో లేను. కానీ ములాయం కొడుకు అఖిలేశ్ తో ఉంటాను అని చమత్కరించారు. ఎస్పీలో సమస్యలు తొలడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/