యూపీలోని సమాజ్ వాది పార్టీ నేతల రాజకీయాలు చూస్తుంటే ‘ఓయమ్మ నీ కుమారుడు మాయిండ్లలొ పాలు పెరుగు మననీడమ్మా... ’ అన్న భాగవత పద్యం గుర్తుకొస్తోంది. శ్రీకృష్ణుడి చిలిపి పనులతో వేగలేని గోపికలు ఆయన తల్లి యశోదకు మొరపెట్టుకున్నట్లుగా యూపీ సీఎం అఖిలేశ్ సింగ్ యాదవ్ తో వేగలేకపోతున్నానంటూ సీనియర్ లీడర్ అమర్ సింగ్ వెళ్లి అఖిలేశ్ తండ్రి ములాయంకు మొరపెట్టుకుంటున్నారు. అఖిలేష్ సింగ్ యాదవ్ - అతని అనుచరులతో తాను వేగలేనని అమర్ సింగ్ ఏడ్చుకున్నంత పని చేశారరట.
ప్రతి దానికి ఓ హద్దు ఉంటుందని... అంతకు మించి భరించడం తన వల్ల కావడం లేదని ములాయంతో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఏం చేయాలో చెప్పాలంటూ ములాయంను అడిగారు. ములాయం సింగ్ తో అమర్ సింగ్ ఈ రోజు వ్యక్తిగతంగా భేటీ అయి తన ఆవేదనను వెళ్లగక్కారు. అఖిలేష్ పై ఫిర్యాదు చేసి ఆయన్ను బాధించడం తనకు కూడా ఇష్టం ఉండదని... కానీ, తనకు ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయని ములాయంకు ఆయన తెలిపారు. తన సొంత కుమారుడిని కూడా కాదని, ములాయం తనకు మద్దతు ఇచ్చారని చెప్పారు. తన బాధను ములాయంతోనే పంచుకుంటానని... ఆయన ఏది చెబితే అది చేస్తానని తెలిపారు.
మొత్తానికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు... ఓవైపు కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ వేగంగా దూసుకుపోతుంటే... మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న సమాజ్ వాదీ మాత్రం ఇంటి పంచాయితీలతో సతమతమవుతోంది. మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో జనం అవస్థలు పడుతున్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాల్సిన ఎస్పీ సొంత గొడవలతో తన గొయ్యి తానే తవ్వుకుంటోందంటున్నారు విశ్లేషకులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/