శ్రీదేవి లేదన్న శోకంతో ఉన్న దేశ ప్రజలకు ఇప్పుడామె మృతిపై వెల్లువెత్తుతున్న సందేహాలకు విస్మయానికి గురి అవుతున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా బయటకు వస్తున్న వివరాలతో పాటు.. ఆమె పార్థిపదేహం ముంబయికి రావటానికి మరింత ఆలస్యమవుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది.
కార్డిక్ అరెస్ట్ తో ఆమె ప్రాణాలు పోగొట్టుకోలేదని.. బాత్రూంలో ఫుల్ గా నీళ్లున్న టబ్ లో పడిపోవటంతో ఆమె మరణించినట్లుగా వెల్లడైంది. అంతేకాకుండా.. శ్రీదేవి రక్తంలో మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయన్న మాట బయటకు వచ్చింది.
ఈ విషయంపై బోనీకపూర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే రాజ్యసభ సభ్యుడు.. సీనియర్ నేత అమర్ సింగ్ స్పందించారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదన్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వైన్ తీసుకునేవారన్నారు. శ్రీదేవి రక్తనమూనాల్లో మద్యం అవశేషాలు ఎలా ఉంటాయని ప్రశ్నించిన అమర్.. ఆమె మృతిపై లోతైన విచారణ చేపట్టాలన్నారు.
శ్రీదేవి మృతి ఉదంతంపై తాను అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడినట్లుగా వెల్లడించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక శ్రీదేవి పార్థిపదేహాన్ని భారత్ కు పంపుతామని ఆయన హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ ను గుర్తించినట్లు యూఏఈ రిపోర్ట్ వెల్లడించనా.. ఆమెకు గుండెపోటు వచ్చిందనే విషయాన్ని ఫోరెన్సిక్ నివేదికలో ప్రస్తావించకపోవటం.