మన దేశంలో ప్రతి చిన్నదానికి రాజకీయ జోక్యం ఉంటుంది. అందుకే.. చట్టం తన పని తాను చేసుకోవటంలో చాలా సందర్భాల్లో తడబాటు కనిపిస్తుంటుంది. కానీ.. దుబాయ్ లో అలాంటి పరిస్థితి ఉండదని చెబుతున్నారు. శ్రీదేవి లాంటి స్టార్ మరణించిన తర్వాత.. ఆమె పార్థిపదేహాన్ని తరలించేందుకు అన్నేసి గంటల పాటు సాంకేతిక కార్యక్రమాలతో వాయిదా వేయటం లేదన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
శ్రీదేవిని ముంబయికి పంపించే విషయంపై తాను అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడినట్లుగా వెల్లడించారు. ఈ ప్రకటనపై దుబాయ్ అధికారిక వర్గాల్ని షాకింగ్‌కు గురి చేసినట్లుగా తెలుస్తోంది.
ఎందుకంటే.. దుబాయ్ లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు స్వయంగా రాజు సైతం జోక్యం చేసుకోని పరిస్థితి. గల్ఫ్ దేశాల్లోకెల్లా దుబాయ్ ప్రాసిక్యూషన్ వ్యవస్థ చాలా శక్తివంతమైందన్న పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
ఆషామాషీగా పోస్ట్ మార్టం తంతు ముగించుకొని బయటకు రావటం కుదరదు. చివరకు కేసుల విషయంలో రాజు జోక్యం కూడా చేసుకోలేరు. అంతటి కట్టుదిట్టమైన వ్యవస్థ ఉన్న చోట.. దేశ రాజుతో సీనియర్ నేత.. కపూర్ కుటుంబానికి దగ్గరైన అమర్ సింగ్ మాట్లాడినట్లుగా వెల్లడించటం దుబాయ్ అధికారుల్ని విస్మయానికి గురి చేస్తోంది.
వాస్తవానికి బోనీకపూర్ కు దుబాయ్ లో స్నేహితులకు కొదవ లేదు. ఆయనకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వారు అక్కడ ఉన్నత స్థానాల్లో ఉన్నవారే. అలాంటి వారే..కామ్ గా ఉండటమే కాదు.. కేసు తీవ్రత దృష్ట్యా బోనీకి ఫోన్లు చేయటానికి జంకుతున్న పరిస్థితి. అలాంటి వేళ అమర్ సింగ్ వ్యాఖ్యలు కలకలంగా మారాయి.