పర్యాటక క్షేత్రంగా అమరావతి పట్టణం

Update: 2015-08-12 13:17 GMT
ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన యాత్రా స్థలాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ ’ప్రసాద్‘ పేరిట ఒక పథకం ప్రారంభించింది. ఇందుకు దేశవ్యాప్తంగా 12 నగరాలను ఎంపిక చేసింది. వాటిలో గుంటూరు జిల్లాలోని అమరావతి ఒకటి. దీనికి దాదాపు రూ.80 కోట్ల నిధులను ఇవ్వనుంది.

ఈ నిధులతో అమరేశ్వరాలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, వైకుంఠపురంలోని వేంకటేశ్వరాలయం, మందడం సమీపంలోని రాణీ రుద్రమదేవి ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు మందడం సమీపంలో యాత్రికులకు రకరకాల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఇక్కడ ఏయే పనులు చేపట్టాలనే అంశంపై దేవాదాయ, పర్యాటక, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, అండ్అండ్ బీ శాఖలు ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపాయి. కేంద్ర అధికారులు అమరావతిలో పర్యటించారు. ఇక కేంద్రం అధికారులు నివేదిక ఇచ్చిన వెంటనే ఆయా గ్రామాల్లో పనులు ప్రారంభం అవుతాయి. అమరావతిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వమే కోట్లాది నిధులు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతోథికంగా నిధులను కేటాయిస్తోంది. మొత్తంమీద అమరావతికి ఇప్పుడు మళ్లీ మహర్దశ పట్టనుంది.
Tags:    

Similar News