నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మెట్రో రైలు నిర్మాణంపై కీలకమైన అడుగుపడింది. మెట్రో నిర్మాణంలో కీలక ప్రక్రియ, నిర్మాణంలో మొదటి అడుగు అయిన సివిల్ పనులకు టెండర్ లు పిలిచారు. 12 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని రెండు భాగాలుగా విభజించి టెండర్లు ఖరారు చేశారు. ఢిల్లీ మెట్రో ఈ మేరకు టెండర్ లు పిలిచింది. మొదటి టెండర్‌కు రూ 314 కోట్లు, రెండో టెండర్ కు రూ 390 కోట్లతో టెండర్ లు పిలిచారు.
ఆన్ లైన్ లో జరిగే ఈ టెండర్ల ప్రక్రియకు నవంబర్ 20వరకు గడువు విధించారు. నవంబరు 20 మధ్యాహ్నం టెండర్ లు తెరవననున్నారు. అర్హత సాధించిన కంపెనీలు రెండేళ్లలో సంబంధిత సివిల్ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి టెండర్ లలో అయిదు స్టేషన్ లు - రెండో టెండర్ లలో ఆరు స్టేషన్లు ఉన్నాయి. రాజధానిలో మెట్రోరైలుకు అనుమతి లేదు అనే దశ నుంచి....అనుమతిపై అనుమానాలు తొలగిపోవడం, కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరమైన పురోగతిగా భావించారు. అదే సమయంలో వెనువెంటనే సివిల్ పనులకు టెండర్ లు పిలవడం కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇదే వేగంతో పనులు పూర్తి చేస్తే..రాజధాని నిర్మాణం కల్లా మెట్రో రెడీగా ఉంటుందని పలువురు అంచనావేస్తున్నారు. మొత్తంగా నవతరం రాజధానిలో..ఆధునిక రవాణా సదుపాయం ఉండటం కలిసివచ్చే అంశమే.