అమరావతి 'బిజినెస్' దూసుకుపోతుంది!

Update: 2016-11-08 10:05 GMT
19 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ సర్కారు నవ్యాంధ్ర కలల రాజధానికి అమరావతి అని పేరు పెట్టినప్పటి నుంచీ ఆ పేరు మార్మోగిపోతోంది. ఈ విషయంలో అమరావతి అంటే అది పేరు కాదు అదొక బ్రాండ్ అని చెప్పుకొచ్చారు. దాంతో నాటి నుంచి అమరావతి అంటే అందరిలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అయితే అమరావతిలో అధికారికంగా ఇప్పటివరకూ తాత్కాలిక సచివాలయం నిర్మాణం మాత్రమే పూర్తయినా కూడా అటు బిజినెస్ సర్కిల్స్ లో మాత్రం దీంతోనే ఫుల్ క్రేజ్ వచ్చేసింది.

రాజధాని పలానా ప్రాంతంలో అని ప్రకటన రాగానే ముందుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు - ఆరు కాయలుగా వెలిగిందని అప్పట్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంచితే... విజయవాడ - గుంటూరులో గత రెండు నెలల్లోనే దాదాపు 200 వ్యాపారాలకు "అమరావతి" అని పేరు పెట్టారట. ఈ ఒక్క విషయం చాలు ఈ పేరుకున్న బ్రాండింగ్ ఏరేంజ్ లో ఉందో అర్థం చేసుకోవడానికి. ఈ విషయంలో గుంటూరు - విజయవాడల్లోనే కాకుండా పక్కనున్న మచిలీపట్నం - నందిగామ లాంటి పట్టణాల్లో కూడా ఈ పేరు మారుమ్రోగిపోతుందట. ఈ క్రమంలో హోటళ్లు - కర్రీ పాయింట్లు - స్కూళ్లు - కాలేజీలు - అకాడెమీలు - కిరాణా షాపులు - మెడికల్ షాపులు - రియల్ ఎస్టేట్... ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి, కాదేదీ అమరావతి పేరుకి అనర్హం అన్నట్లు తమ తమ బిజినెస్ లకు ఈ పేరు తెగ పెట్టేస్తున్నారట!

దీంతో పాటు అమరావతి అనే పేరు తమ ప్రాంతీయతకే కాకుండా, ప్రధానంగా చరిత్రకు కూడా చిహ్నంగా ఉండగా.. ఇప్పుడు బిజినెస్ బ్రాండ్ గా కూడా మారిపోయిందన్నమాట. అలాగే అమరావతి పేరు తమకు బాగా కలిసొస్తోందని, ఈ పేరు చూశాక అప్పటివరకూ షాపుకు రానివాళ్లు కూడా ఆసక్తిగా ఇటువైపు చూస్తున్నారని బిజినెస్ సర్కిల్స్ లో వినిపిస్తోందట. మొత్తం మీద అమరావతికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంకోసం ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో... ఇటు ప్రైవేట్ వర్గాలు కూడా తమవంతు కృషి చేస్తున్నాయన్నమాట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News