ఇక‌..అమ‌రావ‌తి..క‌రీంన‌గ‌ర్ స్మార్ట్ సిటీలే

Update: 2017-06-23 08:23 GMT
కొత్త స్మార్ట్ సిటీల‌ను ప్ర‌క‌టించారు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు. ఇప్ప‌టికే ఉన్న స్మార్ట్ సిటీల‌కు అద‌నంగా మ‌రికొన్ని స్మార్ట్ సిటీల‌ను వెల్ల‌డించారు. కొత్త వాటితో క‌లిసి స్మార్ట్ సిటీలు ఇక‌పై 90 కానున్నాయి. తాజాగా స్మార్ట్ సిటీల జాబితాలో చేరిన ప‌ట్ట‌ణాల విష‌యానికి వ‌స్తే.. ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి క‌నిపిస్తుంది.

తాజా జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన రెండు ప‌ట్ట‌ణాలు స్మార్ట్ సిటీల జాబితాలో చేరాయి. చిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. జాబితాలో చేరిన రెండు స్మార్ట్ సిటీలు.. ఇద్ద‌రు చంద్రుళ్ల మాన‌స చోర ప‌ట్ట‌ణాలు కావ‌టం గ‌మ‌నార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఊళ్లు ఉన్నా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కానీ.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కు కానీ రెండు ప‌ట్ట‌ణాలంటే విప‌రీత‌మైన ప్రేమాభిమానాలు. మిగిలిన వాటితో పోలిస్తే.. వాటికి ఒకింత ఎక్కువ‌గానే ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అలా ప్ర‌ద‌ర్శించే ప‌ట్ట‌ణాలు మ‌రేమో కావు.. తెలంగాణ ప్రాంతంలో క‌రీంన‌గ‌ర్ అయితే.. ఏపీలో అమ‌రావ‌తి.

ఈ రెండు ప‌ట్ట‌ణాల్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చిన‌ట్లుగా వెంక‌య్య ప్ర‌క‌టించారు. తాజా జాబితాలో కొత్త‌గా వ‌చ్చి చేరిన స్మార్ట్ సిటీలు చూస్తే..

+ తిరువ‌నంత‌పురం

+ అమ‌రావ‌తి

+ క‌రీంన‌గ‌ర్

+ త్రివేడ్రం

+ నయారాయ్‌ పూర్

+ రాజ్‌ కోట్

+  పాట్నా

+  ముజాఫర్‌ పూర్

+ పుదుచ్చేరి

+  గాంధీనగర్

+  పసిఘాట్

+  జమ్మూ

+  దాహోడ్

+  శ్రీనగర్

+ సాగర్

+  కర్నాల్

+  సాత్నా

+ బెంగళూరు

+ సిమ్లా

+ డెహ్రాడూన్

+  ఝాన్సీ

+  అయిజాల్

+  అలహాబాద్‌

+ అలీఘడ్

+  గంగ్టోక్

+  తిరుపూర్

+ పింప్రి

+  పింప్రి చించ్వాద్

+  బిలాస్‌ పూర్

+  తిరునవేలి

+  తూటుక్కుడి

+  తిరుచిరాపల్లి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News