మేడారంలో అమరావతి రైతులు.. ఏం చేశారంటే?

Update: 2020-02-08 10:33 GMT
ఏపీకి 3 రాజధానులు వద్దు.. అమరావతియే ముద్దు అని ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు తాజాగా సమ్మక్క-సారలమ్మలు కొలువైన మేడారంలో ప్రత్యక్షమయ్యారు. వనదేవతలను దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మేడారంలో అమరావతియే ఏపీకి రాజధానిగా ఉండాలని..  3 రాజధానులు ఏర్పాటు చేయకుండా సీఎం జగన్ మనసు మార్చాలని కోరుతూ నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.

కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క-సారలమ్మలకు మొక్కుకుంటే తమ సమస్యలు తీరుతాయని ఇక్కడికి వచ్చినట్టు మేడారం రైతులు వాపోయారు.

శుక్రవారం రైతులంతా అమరావతి నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడారానికి బయల్దేరారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వీరంతా వనదేవతలను వేడుకున్నారు.


Tags:    

Similar News