దీప్తి పై దాడి కేసులో అరుగుల రైతుల అరెస్ట్ ... !

Update: 2019-12-30 07:38 GMT
కొన్ని రోజులుగా అమరావతిలోని రాజధానిని ఉంచాలంటూ ..అమరావతి ప్రాంత ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్కడికి వెళ్లిన కొందరు మీడియా ప్రతినిధులపై రైతులు కొందరు అమానుశంగా ఆడవాళ్లు అని కూడా చూడకుండా దాడి చేసారు. అందులో ప్రధానంగా గాయపడిన దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. మీడియా ప్రతినిధుల పైన దాడి చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి అభ్యర్ధించారు. మీడియా రిపోర్టలపైన దాడికి సంబంధించి ఎఫ్‌ ఐఆర్‌ నమోదైంది. ఇందులో పాల్గొన్న వారిగా గుర్తించిన ఆరుగురు రైతులను అర్ద్రరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి తెనాలి తరలించారు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు ఆ ఆరుగురిని హాజరు పర్చగా , వారికీ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది.

అయితే, రైతులపై  నమోదు చేసిన సెక్షన్ల పైన విపక్షాలు మండిపడుతున్నాయి.  రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని ఖండించారు. జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా అని నిలదీసారు. రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాలని - భూములు కోల్పోయి.. రాజధానిపై ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా అంటూ నిలదీసారు. అలాగే  రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులను అరెస్ట్ చేస్తారా.. మహిళలు - వృద్దులను భయ భ్రాంతులను చేస్తారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. . 13రోజులుగా వేలాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అరెస్టులు చేసి, ఈ ఉద్యమాన్ని ఆపలేరంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇకపోతే , అరెస్ట్ అయిన వారిలో ... మోదుగులింగాయపాలెం గ్రామానికి చెందిన బండారు నాగరాజు - ధనశ్రీ నరేష్‌ - వెంకటపాలేనికి చెందిన గోగులపాటి సురేంద్ర - ప్రత్తిపాటి శ్రీనివాసరావు - నెక్కల్లుకు చెందిన రామినేని నరసింహస్వామి - వెలగపూడికి చెందిన భూక్యా లోకానాయక్‌ లు ఉన్నారు.


Tags:    

Similar News