ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా చేసిన ప్రకటనతో ఏపీలో రాజకీయ దుమారం నెలకొంది. ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ నివేదిక సైతం జగన్ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నట్టు తెలియటంతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళనల బాట పట్టారు. గత వారం రోజులుగా ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని ధర్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంత రైతులు రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ గవర్నర్ కలిసి వినతిపత్రం అందించారు. అలాగే ప్రస్తుతం అమరావతిలో జరగుతున్న పరిణామాలు గవర్నర్ కు వివరించారు. గత ప్రభుత్వం రాజధాని కోసం అని అడిగిన తర్వాతే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని - పంటలు పండే భూములు సైతం ఇచ్చామని - అయితే ప్రభుత్వం రాజధానిని తరలించడం ద్వార అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపారు. ఈ రాజధాని తరలింపు వయ్వహారం పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.
అలాగే గతంలో జగన్ కూడా అమరావతిని ఏపీ రాజధానిగా ఒప్పుకున్నారని - కానీ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని అన్నారు. దీంతో తమ జీవీతాలు రోడ్ల పాలు అవుతున్నాయని సీఎం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే , కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా విశాఖలో ఎక్సక్యూటిట్ కాపిటల్ అభివృద్దికి నిధులు మంజురు చేయడంతో పాటు అధికారిక ప్రకటనలు చేస్తున్నారు. చూడాలి మరి దీనిపై ఏపీ గవర్నర్ బిస్వా భూషణ్ హరిచందన ఏ నిర్ణయం తీసుకుంటారో ...