ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునాదులేసుకోవడానికి ముందే గిన్నిస్ రికార్డులు మోత మోగించేలా కనిపిస్తోంది. అమరావతి శంకుస్థాపన సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లు ప్రపంచమంతటినీ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆరంభానికి ముందే అమరావతి ప్రాధాన్యం పెరిగిపోతోంది.
ఆహ్వానితుల సంఖ్య, అంతర్జాతీయ ప్రాధాన్యం కారణంగా ఈ ఏర్పాట్లలో చాలావరకు గిన్నిస్ రికార్డుకు అర్హమైనవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి శంకుస్థాపనకు రమ్మంటూ ఇప్పటివరకు 4,08994 మందిక ఆహ్వానాలు అందాయి. ఇది చిన్న సంఖ్య కాదు.. ప్రపంచంలో ఏ కార్యక్రమానికి కూడా ఇంతమంది ఆహ్వాన పత్రాలు అందలేదని చెబుతున్నారు.
అలాగే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఒకేసారి ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండడం కూడా రికార్డు కానుంది. ప్రధాని మొదలుకుని ముఖ్యమంత్రులు - గవర్నర్లు - ఎమ్మెల్యేలు - ఎంపీలు - ఎమ్మెల్సీలు... గ్రామస్థాయిలో సర్పంచిలు, వార్డుసభ్యులు వరకు భారతదేశంలోని ప్రజాప్రతినిధి వ్యవస్థ లో అన్ని పదవుల్లో ఉన్నవారూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీన్ని కూడా రికార్డుగానే చెబుతున్నారు. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 1353 మంది ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండడం కూడా గిన్నిస్ రికార్డు అవుతుందని చెబుతున్నారు.
మరోవైపు 16 వేల గ్రామాలు - పట్టణాలు - నగరాల నుంచి మట్టి - నీరు సేకరించడం ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎక్కడాలేదు. వీటన్నిటి వల్ల అమరావతి ఆరంభంలోనే రికార్డులు నమోదు చేస్తోంది.