భారతదేశంలో క్రికెట్ అంటే పిచ్చి... ఆరోప్రాణం.. పెళ్లాంబిడ్డలకంటే, తల్లిదండ్రుల కంటే, గర్ల్ ఫ్రెండ్ కంటేకూడా క్రికెట్ కే ప్రాధాన్యమిచ్చేవారున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ అంతే.. క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఎంతదూరమైనా వెళ్తారు చాలామంది.. అలా వెళ్లలేనివారు టీవీలకు అతుక్కుపోతారు. ఆఫీసులకు - వ్యాపారాలకు - కాలేజిలకు డుమ్మా కొడతారు. తిండి, నిద్ర కూడా మర్చిపోతారు. పండుగలు - పబ్బాల రోజున మ్యాచ్ ఉన్నా అదే ధ్యాసలో ఉంటారు. అంత ప్రాధాన్యమున్న క్రికెట్ కు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చిన్నబోయింది.. ఇంతవరకూ ఏ కార్యక్రమమూ క్రికెట్ ను బీటవుట్ చేసిన చరిత్ర లేదు.. కానీ, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శంకుస్థాపన కార్యక్రమం దెబ్బకు ఏపీలోని ఏ టీవీలోనూ క్రికెట్ మ్యాచ్ కనిపించడం లేదు. కుర్రాళ్లు - ముసలాళ్లు - మహిళలు - రైతులు.. ఇలా సకల వర్గాలూ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్నే చూస్తున్నాయి.
వారం రోజులుగా శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లు రాష్ట్రంలో అందరినీ ఆకర్షిస్తున్నాయి. భారీ కార్యక్రమం కావడం.. దానికి సంబంధించి రోజుకో విశేషం తెలుస్తుండడంతో ప్రజల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి ఏర్పడింది. పైగా రాష్ట్రానికి ఇది ఆశాకిరణంగా కనిపిస్తుండడంతో అమరావతి నిర్మాణంపై అందరి చూపు ఉంది. ఈ కారణంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు క్రికెట్ మ్యాచ్ ఉందన్న సంగతినీ మర్చిపోయారు.
చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ నాలుగో వన్డే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్నది పక్కన పెడితే మ్యాచ్ కు ముందే ఏపీలో అమరావతి చేతిలో క్రికెట్ ఓడిపోయిందన్నది మాత్రం తిరుగులేని సత్యం.