నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికను ఏపీ సర్కార్ అద్భుతంగా తీర్చిదిద్దింది. పూర్ణకుంభం చిత్రంతో కూడిన ఆహ్వాన పత్రిక ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తూ దీనిని రూపొందించారు. అక్టోబర్ 22 మధ్యాహ్నం 12.45 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని అందులో పేర్కొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో రాజధాని ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను మంత్రులకు అందజేశారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రి వర్గ సమావేశంలో విస్తృతంగా జరుగుతున్న చర్చ కొనసాగుతుంది. రాజధాని స్వరూపం, అమాత్యుల బాధ్యతలు తదితర అంశాలపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీతో విదేశీ ప్రతినిధుల రాక సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. శంకుస్థాపన రోజు ప్రభుత్వ పనితీరు ప్రతిబింబించేలా కార్యక్రమాల చేపట్టాలని, ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసేలా రూపొందించే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ అంశంతో పాటు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్పు, అలాగే కేశవరెడ్డి పాఠశాలల నిర్వహణ అంశంపై చర్చ జరుగుతోంది.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమంతోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటే అది పెట్టుబడుల సాధనకు ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు యోచనగా తెలుస్తోంది .ఆ కారణంగానే భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీతోపాటు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను పిలుస్తున్నారు. విదేశీ అతిథులూ రానున్నారు. ఇప్పటికే ప్రధానిని ఆహ్వానించారు. దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానించడమే మిగిలిఉంది. వీరి కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు, గట్టి భద్రత కల్పిస్తున్నారు.