ఏంది బాబు.. అమ‌రావ‌తిలో పాల‌న ఇలానా?

Update: 2017-12-23 04:38 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా.. ఏ ముఖ్య‌మంత్రి కూడా చేయ‌న‌న్ని విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్ని చేస్తుంటారు చంద్ర‌బాబు. ఫారిన్ టూర్ల వ‌ల్ల రాష్ట్రానికి ఏదో జ‌రుగుతుంద‌ని చెప్పినా.. గ‌డిచిన నాలుగేళ్లుగా చేస్తున్న ఫారిన్ టూర్లతో వ‌చ్చిన లాభం ఎంత‌న్న లెక్క చూస్తే అస‌లు విష‌యం ఇట్టే తెలుస్తుంది.

తాజాగా.. ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో టూర్ కి వెళ్లిన చంద్ర‌బాబు పుణ్య‌మా అని.. అమ‌రావ‌తిలో ఉద్యోగులు ఎవ‌రికి వారు లీవుల్లో కాల‌క్షేపం చేయ‌టం క‌నిపిస్తోంది. ముఖ్య‌మంత్రి దేశంలో లేక‌పోవ‌టంతో.. అధికారుల‌కు ఇష్టారాజ్యంగా మారింది. ఏడాది చివ‌ర కావ‌టం.. లీవులు.. ఎల్ టీఏ టూర్ల‌కు గడువు ఈనెలాఖ‌రుతో ముగిసిపోనుండ‌టంతో అధికారులు పెద్ద ఎత్తున సెల‌వుల్లో ఉంటున్నారు.

వాస్త‌వానికి ఎడాది చివ‌ర‌కు వ‌చ్చిందంటే.. బ్యాలెన్స్ సెల‌వుల్ని ఏదోలా తీసుకోవ‌టానికి ఎవ‌రికి వారు పోటీ ప‌డుతుంటారు. రాష్ట్రాధినేత ఊళ్లో ఉంటే మొహ‌మాటంతోనో.. భ‌యంతోనే.. బాగోద‌నో లీవులు తీసుకోలేరు. ఇప్పుడు ముఖ్య‌మంత్రే ఫారిన్ టూర్ లో ఉండ‌టంతో అమ‌రావ‌తిలోని ఏపీ స‌చివాల‌యంలోని ఉద్యోగుల్లో అత్య‌ధికం సెల‌వుల్లో ఉండిపోయారు. దీంతో.. రాష్ట్రంలో పాల‌న ప‌డ‌కేసిన ప‌రిస్థితి.

రెండు రోజులుగా ప‌లు శాఖల కార్యాల‌యాలు అర‌కొర సిబ్బందితో ఖాళీగా ఉన్నారు. బ‌యోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల హాజ‌రును లెక్కిస్తున్న అధికారులు.. గ‌డిచిన మూడు రోజులుగా ఉద్యోగుల హాజ‌రు చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. న‌వంబ‌రులో ఉద్యోగుల హాజ‌రు విష‌యానికి వ‌స్తే.. దాదాపు 20 శాతం మంది ఉద్యోగులు లీవుల్లో ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే సెల‌వు తీసుకోవ‌టం.. లేదంటే ఆన్ డ్యూటీ పెట్టి హైద‌రాబాద్‌కు ప‌రిమితం అవుతున్న అధికారుల్ని గుర్తించారు.

నిత్యం అలెర్ట్ గా ఉండాల్సిన విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ‌లో 41 శాతం ఉద్యోగులు అబ్సెడెంట్స్ కాగా.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో 32 శాతం మంది లీవుల్లో ఉన్నారు. సాధార‌ణ ఉద్యోగుల‌తో పాటు ఐఏఎస్ అధికారులు కూడా ఇదే తీరులో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ప‌ని ఒక చోట‌.. మ‌న‌సు మ‌రోచోట అన్న‌ట్లుగా మారింద‌ని చెబుతున్నారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో హైద‌రాబాద్ నుంచి పెద్ద ఎత్తున అధికారులు క‌ష్ట‌మ్మీద అమ‌రావ‌తికి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వారి కుటుంబాలు వేర్వేరు కార‌ణాల‌తో భాగ్య‌న‌గ‌రిలోనే ఉండిపోయాయి. దీంతో.. కుటుంబ స‌భ్యుల్ని క‌లిసేందుకు అధికారులు ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతో హాజ‌రు విష‌యంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇదే తీరులో మ‌రికొంత కాలం సాగితే.. ఏపీలో పాల‌న మ‌రింత దారుణంగా మారుతుంద‌ని చెబుతున్నారు. గ‌డిచిన మూడు రోజులుగా త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వ‌స్తున్న వారు.. అధికారుల లీవుల‌తో ఏ ప‌ని కాక‌.. ఉత్త చేతుల‌తో వెన‌క్కి వెళ్లాల్సి వ‌స్తోంది. ఇదే తీరులో సాగితే.. ఏపీలో పాల‌న ప‌డ‌క వేయ‌టం ఖాయ‌మంటున్నారు.
Tags:    

Similar News