ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక ఉత్కంఠ కు తెరదించారు. గత కొంత కాలంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న చర్చోపచర్చలకు, సందేహాల పరంపరకు ఆయన చెక్ పెట్టారు. సీఆర్‌డీఏపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ సీఆర్‌డీఏ పరిధిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణ విషయం లో ఓకే చెప్పేశారు. అయితే, గత ప్రభుత్వం వలే అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటుగా, రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కొనసాగించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే చేపట్టిన రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణం, భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన (ఎల్‌పీఎస్) లే అవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహ నిర్మాణాల వంటి పనులన్నింటినీ కొనసాగించాలని...పూర్తి కావొస్తున్న నిర్మాణాలపై ముందు దృష్టి పెట్టాలని.. ఇందుకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్ స్పష్టం చేశారు. పనుల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ వెళితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సూచించారు.
రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల ను అభివృద్ధి చేసి.. వారికి ఇవ్వాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. రాసీ ఆర్డీఏ పరిధి లో రోడ్ల డిజైన్‌ల గురించి అధికారులను పూర్తి వివరాలు అడిగిన సీఎం వైఎస్ జగన్.. ప్లానింగ్‌లో ఎక్కడా తప్పులు ఉండకూడదని సూచించారు. రాజధానిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు అవసరమైనంత మేరకే రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎనిమిది, ఆరు వరుసలుగా నిర్మించాలనుకున్న రహదారుల వెడల్పు తగ్గించాలని, భవిష్యత్తులో అవసరమైనప్పుడు విస్తరించుకునేందుకు వీలుగా అటూ ఇటూ ఖాళీ ప్రదేశం వదిలిపెట్టాలని సూచించారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో, ఖర్చు, డిజైన్ల తదితర అంశాలపై ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.జధానిలో రోడ్ల నిర్మాణం చేయగా మిగిలిన భూమిని ల్యాండ్ స్కేపింగ్ చేసి సుందరీకరించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పన లో వ్యయం తగ్గించి.. మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రాజధానితో పాటుగా కృష్ణా నది సమీపం లో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్థితి పై అధికారుల తో చర్చించారు. అలాగే వైకుంఠపురం రిజర్వాయర్ నిర్మాణం, నీటి వినియోగంపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. మొత్తం రాజధాని ప్రాంతాన్ని 13 జోన్లుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారని, వాటిలో భాగంగానే ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో మౌలిక వసతులూ అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, దీనికి రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారని అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు. ముఖ్యమైన పనులకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఎం జగన్...అత్యవసరం కాని పనులకు ఎక్కువగా ఖర్చులు చేయవద్దని సూచించారు. కాగా, సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఏపీ రాజధానిపై నెలకొన్న సందేహాలకు చెక్ పడిందని అంటున్నారు.
ఇదిలాఉండగా, ముఖ్యమంత్రి జగన్ సమీక్ష అనంతరం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాజధాని నిర్మాణం ఏమైందంటూ టీడీపీ ప్రశ్నిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానికి 2015, అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు దాదాపు నాలుగేళ్లలో చేసిందేమీ లేదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. తన హయాంలో రాజధానిని నిర్మించకుండా చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.రాజధానిని నిర్మించడంలో విఫలమైన చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తానని చెప్పడం ఏమిటని నిలదీశారు. ప్రజలు 50 ఏళ్లపాటు అధికారం ఇచ్చారని ఆయన భావించారేమోనని ఎద్దేవా చేశారు.