అమరావతి సేఫ్ కాదు.. సంచలన నిజం

Update: 2019-12-19 07:38 GMT
ఏపీ కలల రాజధాని గా చంద్రబాబు ప్రతిపాదించిన విజయవాడ-అమరావతి ప్రాంతం ఎంత మాత్రం సేఫ్ కాదని తాజాగా ఓ సంచలన పరిశోధన నిగ్గుతేల్చింది. దేశవ్యాప్తంగా భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలపై తాజాగా హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆథార్టీ చేసిన పరిశోధనలో ఈ షాకింగ్ విషయం వెలుగుచూసింది.

దేశంలోని విజయవాడ, చెన్నై సహా 50 నగరాలకు భూకంపం ముప్పు పొంచి ఉందని పరిశోధన తేల్చింది. ఇందులో 14 నగరాలు హైరిస్ట్ జోన్ లో ఉన్నాయని.. మరో 15 నగరాలు మీడియం రిస్క్ జోన్ లో ఉన్నాయని పరిశోధనలో తేలింది.

ఏపీ రాజధాని ప్రాంతం అమరావతితోపాటు ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, గ్యాంగ్ టక్, అజ్వాల్, రత్నగిరి,చత్తీస్ ఘడ్, డార్జిలింగ్, శ్రీనగర్, సిమ్లా, పానిపట్, పితోరగర్హ్, ఉత్తరాక్షి, మొరదాబాద్, భగల్ పూర్ లలో అధికంగా భూకంపాలు వస్తాయని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ ఏమాత్రం కదలిక వచ్చినా ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు.

ఏపీలోని విజయవాడ సముద్ర తీరానికి సమీపంలోనే ఉంది. సాధారణంగా సముద్ర తీరప్రాంతాల్లోనే జనం ఎక్కువగా నివసిస్తుంటారు. సముద్ర దగ్గరి ప్రాంతాల్లోనే భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సముద్రంలోని భూ ఫలకాలు కదలిక ఏర్పడినప్పుడు భూకంపాలు, సునామీలు వచ్చి ప్రాణనష్టం జరుగుతుంది. అటువంటి డేంజర్ జోన్ లో మన అమరావతి ఉండడం షాకింగ్ అనే చెప్పాలి.
Tags:    

Similar News