జగన్ పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు

Update: 2016-03-22 07:14 GMT
వైసీపీ అధినేత జగన్ కు సొంత పార్టీలో మరో ఎమ్మెల్యే నుంచి తిరుగుబాటు మొదలైంది. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ నిర్ణయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కొద్దిసేపటి కిందట ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. పీఏసీ ఛైర్మన్ పదవిని కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కట్టబెట్టిన నేపథ్యంలో అమరనాథ్ రెడ్డి ఇలా తన అసంతృప్తిని బయటపెట్టారు. అయితే... ఆయన తనకు పదవి రాలేదన్నట్లుగా కాకుండా సీనియర్లకు అన్యాయం జరిగిందన్న అబిప్రాయాన్నే వ్యక్తం చేశారు.

కాపు వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూకు పీఏసీ పదవి ఇస్తారని భావించామని... అయితే.. ఎవరినీ ఒక్క మాట కూడా అడగకుండా జగన్ ఏకపక్షంగా రాజేంద్రనాథరెడ్డి పేరు ప్రకటించడంతో షాక్ తిన్నామని ఆయన అన్నారు. అందరూ చిత్తూరు జల్లావారు తెలివైనవారు అని అనుకుంటారని, కానీ, వైసీపీలో మాత్రం చిత్తూరోళ్లకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. దాంతో ఆయన తనతో పాటు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలుపుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.  

మరి జగన్ నిర్ణయంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేసిన అమరనాథ్ రెడ్డి తన ఆవేదనను గుండెల్లోనే దాచుకుంటారో లేదంటే ఆ కోపంతో మిగతావారిలా జగన్ కు గుడ్ బై చెబుతారో చూడాలి.
Tags:    

Similar News