కొన‌సాగుతున్న అమ‌ర్ నాథ్ యాత్ర

Update: 2017-07-11 09:43 GMT
ఉగ్ర‌దాడి అనంత‌రం అమర్‌ నాథ్‌ యాత్ర మ‌ళ్లీ ప్రారంభ‌మైంది. భక్తులపై ఉగ్రవాదులు దాడికి నిరసనగా జ‌మ్మూ క‌శ్మీర్ లో రెండు రోజుల బంద్ కు విపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ రెండ్రోజుల పాటు విద్యాసంస్థలు కూడా మూసివేయనున్నారు. అయితే, బంద్ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అమర్‌ నాథ్ యాత్ర కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

జ‌మ్మూ నుంచి పలు యాత్రికుల బృందాలు అమర్‌ నాథ్ బయలుదేరాయి. ఈ రోజు యాత్ర‌కు దాదాపు 3289 మంది యాత్రికులను తీసుకువెళ్తున్నారు. దాదాపు 150 బ‌స్సుల్లో యాత్రికులు ప్ర‌యాణించ‌నున్నారు. ఉగ్ర‌దాడుల నేస‌థ్యంలో అమ‌ర‌నాథ్ యాత్రికుల‌కు భ‌ద్ర‌త‌ను మరింత క‌ట్టుదిట్టం చేశారు. నేటి నుంచి ప‌టిష్ట భ‌ద్ర‌త న‌డుమ యాత్ర కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి నుంచే భద్రతా బలగాలు జుమ్ముకు చేరుకుంటున్నాయి. యాత్రకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఆర్‌ పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్ చెప్పారు. అనంతనాగ్‌ లో దాడి జరిగిన ప్రాంతంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

ఈ రోజు అమ‌ర‌నాథ్ యాత్ర‌కు వెళ్తున్న‌యాత్రికులు - వాహ‌నాల వివరాల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు న‌మోదు చేసుకున్నాయి. నిన్న దాడి జ‌రిగిన బ‌స్సు భ‌ద్రతా మార్గ‌ద‌ర్శ‌కాల‌కు విరుద్ధంగా వేరే మార్గంలో ప్ర‌యాణించ‌డం వ‌ల్లే ఉగ్ర‌ దాడి జ‌రిగడంతో భ‌ద్ర‌తా సిబ్బంది క‌ట్టుదిట్ట‌మైన త‌నిఖీలు చేస్తున్నారు. ప్ర‌తి కిలోమీట‌రుకు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌హారా కాస్తున్నాయి. జ‌మ్మూ క‌శ్మీర్ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముఫ్తీ - గ‌వ‌ర్న‌ర్ ఎన్ ఎన్ వోహ్రాలు ప‌రిస్థితిని స‌మీస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌ లోని అనంత్‌ నాగ్‌ జిల్లాలో సోమవారం రాత్రి అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. రాత్రి 8.20గంటల ప్రాంతంలో అనంత్‌ నాగ్‌ కు సమీపంలోని బటంగూ ప్రాంతంలోని పోలీసులకు సంబంధించిన ఓ వాహనంపై ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపారు. పోలీసులు ప్రతిఘటించి ఎదురుకాల్పులకు పాల్పడటంతో ముష్కరులు మరింత రెచ్చిపోయారు. అదే సమయంలో హైవేపైకి వచ్చిన అమర్‌ నాథ్‌ యాత్రికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతిచెందగా.. మరో 11 మంది గాయపడ్డారు.
Tags:    

Similar News