ఈ ప్రపంచంలో దాదాపుగా అందరూ బిజీనే. ఎవరికి తగ్గ పనుల్లో వారు చాలా బిజీగా ఉంటుంటారు. ఎంత బిజీ పర్సన్ అయినా తన వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించి తీరాలి కదా. అందుకే అలుపెరగకుండా పని చేసే అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ కూడా వీలుచిక్కినప్పుడల్లా తన ప్రేయసితో విహార యాత్రలు చేస్తుంటాడు. ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన ప్లేస్ ఏదో తెలుసా, నువ్వు నా పక్క ఉండడం. అది చాలు, అంటూ బెజోస్ తో ఉన్న ఫొటోల్ని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది బెజోస్ ప్రేయసి లారెన్ సాన్ షెజ్. పెంపుడు కుక్కతో ఇద్దరూ సరదాగా కయాకింగ్ చేస్తున్న ఫొటోల్ని షేర్ చేసిందామె.
భార్య మెక్ కెంజీ స్కాట్ తో విడాకుల తర్వాత, అమెరికా టాప్ న్యూస్ యాంకర్ అయిన లారెన్ సాన్ షెజ్ ప్రేమాయణం నడిపిస్తున్నాడు బెజోస్. విశేషం ఏంటంటే.. ఆమెకి కూడా ఇది రెండో రిలేషన్ షిప్. ఇక మెక్సికన్-అమెరికన్ అయిన లారెన్ 2019 నుంచి బెజోస్ తో రిలేషన్‌లో ఉంది. జర్నలిజంలో ఎమ్మీ అవార్డు సైతం అందుకున్న లారెన్, హెలికాప్టర్ పైలెట్ కూడా. ఆమె సంపద విలువ 30 మిలియన్ డాలర్లు. సీటెల్‌లో పక్కపక్కనే ఇల్లు ఉండడం ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం మొదలైంది . కిందటి ఏడాది జనవరిలో బెజోస్ భారత పర్యటన సందర్భంగా ఇద్దరూ కలిసి తాజ్ మహల్ దగ్గర ఫొటోలు సైతం తీయించుకున్నారు.
1994 సంవత్సరంలో జెఫ్ బెజోస్ అమెజాన్‌ను గ్యారేజ్ నుండి ప్రారంభించారు. అప్పుడు అతను పాత పుస్తకాలను మాత్రమే అమ్మేవాడు. దీని తరువాత దాని వెబ్ సైట్ జూలై 1995లో వచ్చింది. అమెజాన్ నివేదిక ప్రకారం దాదాపు రెండు సంవత్సరాల తరువాత 1997 చివరి నాటికి 150కి పైగా దేశాలలో కంపెనీ 1.5 మిలియన్లకు పైగా వినియోగదారులకు చేరువైంది. ప్రారంభంలో కొన్నేళ్ల పాటు కంపెనీ నష్టాలను చవిచూసిందట. మొదటి సంవత్సరం లోనే కంపెనీ రూ .16 లక్షలకు పైగా నష్టాన్ని చవిచూసింది. కానీ తరువాత ప్రతి సంవత్సరం లాభాలు వచ్చాయి. అమెజాన్ వార్షిక నివేదికల ప్రకారం 2019 సంవత్సరంలోనే కంపెనీకి లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2005 సంవత్సరంలో కంపెనీ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ప్రారంభించింది, ఇది కంపెనీని కొత్త ఎత్తులను తీసుకెళ్లింది. కస్టమర్ సంతృప్తి ప్రాథమిక మంత్రంపై జెఫ్ బెజోస్ ఎల్లప్పుడూ పనిచేసేవాడు, దీని కోసం సంస్థ అనేక ప్రయోగాలు చేసింది. జెఫ్ బెజోస్ సంపద గురించి మాట్లాడితే 2018లో అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు.