భారత్ లో పవర్ ఫుల్ కపుల్ వీళ్లే.. అంబానీ దంపతులే టాప్!
మన దేశంలో పవర్ ఫుల్ కపుల్ గా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ తొలి స్థానాన్ని సంపాదించుకున్నారు. భారత్ లోని బెస్ట్ పవర్ ఫుల్ కపుల్ సర్వేలో అత్యధిక మంది వీరికి ఓటు వేశారు. ప్రపంచస్థాయి కుబేరులుగా నిలిచిన ముకేశ్ దంపతులకు ఈ గుర్తింపు దక్కడం విశేషం.
భారత్ లోని పవర్ ఫుల్ దంపతులు ఎవరు అనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్ సంస్థ సర్వే చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఐఐహెచ్ బీ ముంబయిలో గురువారం విడుదల చేసింది. ఆ ఫలితాల్లో పవర్ ఫుల్ జంటగా ఆమోదం తెలుపుతూ అత్యధిక మంది ఓటు వేశారు. మొత్తం వందకు గాను 94మార్కులు అంబానీ కపుల్ కు దక్కాయి.
దేశంలోని పవర్ ఫుల్ జంటగా ప్రపంచకుబేరులు ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ తొలి స్థానం సంపాదించుకోగా... దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో వీరికి 86 స్కోరు లభించినట్లు సర్వే ఫలితాల్లో వెల్లడించారు. ఈ క్రేజీ జంటకు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెల్సిందే.
మూడో స్థానంలో విరుష్క జంట నిలిచింది. ఆది నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే విరాట్-అనుష్క... పాప పుట్టిన తర్వాత కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. 2019లో బెస్ట్ కపుల్ గా తొలిస్థానంలో నిలిచిన ఈ జంట... ఈ ఏడాది 79 మార్కులతో మూడో స్థానానికి పరిమితం అయింది.
వివాహ బంధంలోకి త్వరలో అడుగుపెట్టనున్న అలియాభట్, రణబీర్ కపూర్ జంట 72 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక నూతన వధూవరులు విక్కీ, కత్రినా జంటలు తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నారు. వీరికి 48 మార్కులు పడ్డాయి. వీరికంటే ముందు అక్షయ్-ట్వింకిల్, షారుఖ్-గౌరీ ఖాన్, సైఫ్-కరీనా కపూర్, అమితాబ్-జయాబచ్చన్ లు కూడా బెస్ట్ కపుల్ గా వివిధ స్థానాల్లో నిలిచారు.
ఐఐహెచ్ బీ చివరిసారిగా 2019లో బెస్ట్ కపుల్ లిస్టును విడుదల చేసింది. ఆ తర్వాత కరోనా కారణంగా 2020లో రిలీజ్ చేయలేదు. ఈ సారి చేపట్టిన సర్వేలో ఈ ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో 1,362 మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.
ఇకపోతే ఇంతకుముందు వాణిజ్య రంగంలోని ప్రముఖులను పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించారు. ఈ సారి మాత్రం వారికి కూడా చోటు దక్కిందని పేర్కొన్నారు. ముకేశ్ అంబానీ జంట దేశంలోనే నంబర్ వన్ పవర్ ఫుల్ కపుల్ గా నిలిచారు.