ఆసక్తికర విషయాలకు నెలవుగా మారుతున్నాయి కొన్ని ప్రైవేటు ఇంటర్వ్యూలు. గతంలో పరిమితంగా ఉండేవి పత్రికలు.. టీవీ ఛానళ్లు. కానీ.. వెబ్ చానళ్ల పుణ్యమా అని మొత్తం సీన్ మారిపోయింది. ఎవరు ఎప్పుడు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయటం.. వారిని అడగాల్సిన ప్రశ్నలు అడగటం మామూలైంది. దీంతో.. సంచలన వ్యాఖ్యలకు ఆన్ లైన్ ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గతంలో రాజకీయ పరిణామాల్ని మార్చే సత్తా మీడియాకు ఉంటే.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఆ స్థానాన్ని సోషల్ మీడియా సొంతం చేసుకున్న పరిస్థితి.
తాజాగా అలాంటి పొలిటికల్ ఇంటర్వ్యూను ఒక వెబ్ చానల్ చేసింది. సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాపునేతగా సుపరిచితుడైన అంబటి రాంబాబును ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. బీజేపీలు కలిసిన పక్షంలో వైసీపీ ఇబ్బంది కాదా? అని ప్రశ్నిస్తే.. అందుకు అలాంటి అవకాశమే లేదన్నారు అంబటి. 2014లో పరిస్థితి వేరన్న ఆయన.. అప్పట్లో రాష్ట్రం విడిపోయి ఉండటం.. చంద్రబాబు సీనియర్ అన్న భ్రమ ప్రజల్లో ఉండటంతో అప్పట్లో ఆ కాంబినేషన్ వర్కువుట్ అయ్యిందని.. భవిష్యత్తులో అలాంటి అవకాశం లేదన్నారు.
కాపునేత ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ ప్రభుత్వం వేధించిన వేళ.. ఆయనకు మద్దతుగా దాసరి నారాయణరావు.. చిరంజీవితో సహా పలువురు నేతల్ని.. కాపు నేతల్ని ఒక తాటి మీదకు తీసుకురావటంలో అంబటి రాంబాబు కీలక భూమిక పోషించటం తెలిసిందే. అయితే.. ముద్రగడను ఆయన కుటుంబాన్ని వేధించిన సమయంలో పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నను సంధించారు అంబటి రాంబాబు.
ఒకవేళ 2024లో చంద్రబాబు.. పవన్ కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేసిన పక్షంలో.. ముద్రగడ విషయంలో వీరిద్దరూ కుమ్మకయ్యారన్న విషయానికి పవన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. కాపులు పవన్ ను మోయాల్సింది చంద్రబాబు కోసమా? అని ప్రశ్నించారు. దీనికి పవన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
రాజకీయాల్లో రెడ్లు.. కమ్మలేదా? మూడో వారి చేతుల్లోకి అధికారం రాకూడదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అంబటి.. తాను అలా అనుకోనన్నారు. కాకుంటే.. కులాల కారణంగా ముఖ్యమంత్రులు ఎవరూ కాలేరన్నారు. కావాలంటే తన మాటను రాసి పెట్టుకోవాలన్నారు. ఎన్టీ రామారావు కమ్మ సామాజిక వర్గం కారణంగా ముఖ్యమంత్రి కాలేదని..ఆయనో లెజెండరీ గా అభివర్ణించారు. కాకుంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మా కమ్మ.. కమ్మ అని కమ్మసామాజిక వర్గం వారు అనుకొని ఉండొచ్చన్నారు. అదే విధంగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది రెడ్డి సామాజిక వర్గం వల్ల అయ్యారా? ఆయనో లెజెండరీ. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా రెడ్డి సీఎం అయ్యారని అనుకోవచ్చు. పవన్ కల్యాణ్ కానీ చిరంజీవి కానీ కాపు కులంతో రాష్ట్ర ముఖ్యమంత్రులు కాలేరన్నారు.
ఎవరూ తమ కులం కారణంగా ముఖ్యమంత్రులు కాలేరని.. కాకుంటే ముఖ్యమంత్రి అయ్యాక సదరు కులం వారు.. ఆ నాయకుడ్ని తమ వాడిగా అనుకునే అవకాశం ఉండొచ్చన్నారు. సినిమాల పరంగా పవన్ కల్యాణ్ మూవీని తాను అస్సలు మిస్ కానన్నారు. పవన్ సినిమాల్ని తాను తప్పనిసరిగా చూస్తానని.. రాజకీయాల్లో మాత్రం అందుు భిన్నమన్నారు. మొత్తంగా చంద్రబాబు.. పవన్ కలిసి ఎన్నికల బరిలోకి దిగితే.. అది అపవిత్ర బంధం అన్న అర్థం వచ్చేలా అంబటి తన వాదనను వినిపించటం గమనార్హం.