రామోజీరావు మీద తీవ్ర విమర్శలు...టీడీపీ ప్రెసిడెంట్ ఆయనేన‌ట...?

Update: 2022-08-30 16:14 GMT
మీడియా టైకూన్ గా ఉంటూ తెలుగు రాజకీయాల్లో కూడా ఎంతో కీలకంగా ఉంటూ వస్తున్న రామోజీవారు మీద రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఆయన టీడీపీ మద్దతుదారు అని ఆ పార్టీకి అనుకూలంగా వార్తలు రాయిస్తారు అని చెబుతూ ఉంటారు. అయితే వైసీపీ మంత్రి ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు అయితే రామోజీరావు మీద ఘాటైన కామెంట్స్ చేసి తీవ్రం అంటే ఏంటో ఫస్ట్ టైమ్ మీడియాకే చూపించారు.

ఆయన రామోజీరావుని వైట్ కాలర్ క్రిమినల్ అంటూ ఘాటైన పదజాలంతో  నిందించారు. మార్గదర్శి ఫైనాన్స్ పేరిట రిజర్వ్ బ్యాంక్ నిబంధలనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించి చట్టాలను అతిక్రమించారని ఆరోపించారు. ఆయన ఏకంగా 2,600 కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూల్ చేశారని పేర్కొన్నారు.

ఇక ఆయన వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అని తనకు చట్టాలు వర్తించవు అని భావిస్తారు అని అంబటి విమర్శించారు. 2018 డిసెంబర్ 30న ఉమ్మడి హై కోర్టు రెండుగా విడిపోయిన సందర్భంలో రామోజీరావు మీద కేసు హై కోర్టులో కొట్టేశారని అంబటి పేర్కొన్నారు. నాడు ఆ విషయం ఎవరికీ తెలియదని, కనీసం ఏపీ సర్కార్ కి సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు.

ఇక దాని మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, తాజాగా వైసీపీ సర్కార్ తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో రామోజీరావుకు ఆగ్రహం వచ్చినట్లు ఉందని అంబటి అన్నారు. అందుకే తమ సర్కార్ మీద ప్రతీ రోజూ ఫస్ట్ పేజ్ టాప్ బ్యానర్ లో వార్తలు రాస్తూ బురద జల్లుతున్నారని అన్నారు.

ఇక పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ని నాడు చంద్రబాబు రామోజీవారు బంధువులు అయిన నవయుగకు మూడు వేల మూడువందల రెండు కోట్ల రూపాయలు విలువ చేసే దాన్ని కనీసం టెండర్ కూడా పిలవకుండా నామినేషన్ పద్ధతిలో ఇచ్చేశారని, ఇది పెద్ద స్కాం అని అంబటి అన్నారు. వైసీపీ వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ లో ఎనిమిది వందల కోట్లని తగ్గించి మెఘా సంస్థకు అప్పగించిందని, అయితే అదొక కడుపు మంట కూడా ఉండడంతోనే పోలవరం మీద కూడా తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు.

ఇక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు పేరుకు ప్రెసిడెంట్ అయితే అసలైన అధ్యక్షుడు రామోజీరావు అని అంబటి కొత్త విషయం చెప్పారు. ఎన్టీయార్ ని గద్దె దించడంతో రామోజీరావు పాత్ర కీలకం అన్నారు. మొత్తానికి రామోజీరావు మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసిన అంబటి దుష్ట చతుష్టయంతో ఢీ కొడతామనే చెప్పుకొచ్చారు. మరి దీని మీద అవతల వారు చూస్తూ ఊరుకుంటారా.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News