పవన్ మీద అన్ స్టాపబుల్ పంచులు...సెటైర్లు

Update: 2022-12-27 15:49 GMT
జనసేన అధినేత కం సినీ నటుడు పవన్ కళ్యాణ్ అలా బాలయ్య ఓటీటీ షోకి గెస్ట్ గా అటెండ్ అయ్యారో లేదో ఇలా పవర్ ఫుల్ పంచులు సెటైర్లు పడిపోతున్నాయి. ఇవన్నీ కూడా అన్ స్టాపబుల్ అని చెప్పాలేమో. నిజానికి పవన్ ఈ షోకి ఒక ప్రముఖ నటుడిగా వెళ్ళి ఉండవచ్చు. కానీ ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు.

పైగా అధికార వైసీపీ మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దాంతో దొరికిందే చాన్స్ అంటూ మంత్రులతో పాటు వైసీపీ సోషల్ మీడియా కూడా పవన్ మీద అస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ బాలయ్య ఓటీటీ షోకి వెళ్ళడాన్ని కూడా ప్యాకేజి షోగానే వారు జమ కట్టేస్తున్నారు.

దీని మీద మంత్రి అంబటి రాంబాబు అయితే తన అధికార ట్విట్టర్ ద్వారా ఏకంగా ఒక పోస్ట్ పెట్టేశారు. రక్త సంబంధం కన్నా ప్యాకేజ్ బంధం గొప్పదా అని ప్రశ్న కూడా అందులో ఆయన వేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఒక షో చేస్తే అటెండ్ కానీ పవన్ కళ్యాణ్ బాలయ్య షోకి మాత్రం వెళ్ళిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.

మరో వైపు కాపు సామాజికవర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన బాలయ్య ఎదుట పవన్ చేతులు కట్టుకుని వెళ్లడమేంటి అని వైసీపీ సోషల్ మీడియా  విభాగం గర్జిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంత ఓటీటీ అయిన అహాలో బాలయ్యని హోస్ట్ గా పెట్టి అన్ స్టాపబుల్ ని నిర్వహిస్తున్నారు. సెకండ్ సీజన్ కి ఫస్ట్ గెస్ట్ గా బావ చంద్రబాబు వచ్చారని, ఇపుడు పవన్ కూడా వచ్చారని, తెలుగుదేశం జనసేనల మధ్య స్నేహ బంధానికి ఇదే ఉదాహరణ అంటూ వైసీపీ అయితే గట్టిగానే తగులుకుంటోంది.

ఇక అన్ స్టాపబుల్ షో లో బాలయ్య ఒక ఎపిసోడ్ లో నేరుగా దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ కి ఫోన్ చేసి మరీ మీరు వస్తారా అంటూ అడగడం మీరు ఒక్కరే కాదు ఆయనతో కూడా రావాలని కోరడం జరిగింది. అది ఈ రోజు నెరవేరింది. పవన్ బాలయ్య ఎపిసోడ్ అంటే జనాలతో పాటు ఫ్యాన్స్ లో కూడా మంచి ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యం నుంచి చూసినపుడు మాత్రం టీడీపీ జనసేనల మధ్య బంధం గట్టిగా బలపడుతుంది అని అంటున్నారు.

దీనికి రాజకీయ మసాలా పూస్తూ వైసీపీ మంత్రులు నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఈ ఎపిసోడ్ మీద ఒక వైపు సినీ లవర్స్ అటెన్షన్ ఉన్నట్లే రాజకీయ అటెన్షన్ కూడా ఉంది అంటున్నారు. ఎందుకంటే పవన్ ఏపీలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తున్నారు. దాంతో పవన్ ఈ షోకి రావడంతో వైసీపీ నేతలు ఏపీలో రచ్చ రచ్చ చేస్తున్నారు. బావ తో తిరిగిన పవన్ బావమరిదితో తిరిగితే తప్పేముంది అని మాజీ మంత్రి పేర్ని నాని కూడా కామెంట్స్ చేశారు. మొత్తానికి అన్ స్టాపబుల్ గా పవన్ మీద పంచు డైలాగులు పేల్చడానికి వైసీపీ రెడీ అయిపోయింది అనుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News