ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మిస్తామని పదే పదే చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ పరువు పోయే స్థాయికి చేరిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాత్కాలిక అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్ బాంబు ప్రూఫ్, లాంచర్ ప్రూఫ్ అని బీరాలు పలికారని....కానీ ప్రతిపక్ష నేత ఛాంబర్ వాటర్ ప్రూఫ్ కూడా లేదని వ్యాఖ్యానించారు. కేవలం 20 నిమిషాలు కురిసిన వర్షానికే నీటిమయం అయిందన్నారు. సచివాలయంలో లీకైంది నీరు కాదని, చిన్న నీటికే బురదమయం అయిన పరిస్థితితో రాష్ట్ర ప్రభుత్వ పరువు - మర్యాద గంగలో కలిసిపోయాయని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలే వైఎస్ జగన్ ఛాంబర్ లో పైపులు కట్ చేశారని మంత్రులు నీచమైన మాటలు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు.
రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా దోపిడీ తప్ప మరొకటి లేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విపరీతమైన అవినీతిమయం చేసిన సీఎం చంద్రబాబు నవ నిర్మాణ, మహా సంకల్ప దీక్ష అంటూ కాకమ్మ కథలు చెబుతున్నాని విమర్శించారు. నవ నిర్మాణ దీక్షలకు వచ్చిన ప్రజలతో ప్రతిజ్ఞలు చేయించడం కాదు.. అసలు ప్రతిజ్ఞ మీరు చేయాలని చంద్రబాబుకు సూచించారు. అవినీతి అక్రమాలు మానేసి - రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలిస్తానని ప్రతిజ్ఞ చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. లేదంటే ఈ మూడు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన గొప్ప కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. గొప్పగా చెప్పుకోవడానికి ఏదైనా ఒక్క మంచిపని చేశావా.. బాబు అని నిలదీశారు. పొగిడేవారు కరువై చంద్రబాబును ఆయన్ను ఆయనే పొడుగుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న సంఘటలనకు బాధ్యత వహించకుండా విపక్ష నేతపై ఆరోపణలు చేయడం చిత్రంగా ఉందని అంబటి అన్నారు. తునిలో రైలు తగలబడిపోతే ఆ రైలు తగలేసింది ఎవరనే విచారణ చేయకుండానే సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇది కాపుల పనికాదు.. రాయలసీమ నుంచి మనుషులు వచ్చి తగలబెట్టారని బురదజల్లారన్నారు. అంతే కాకుండా రాజధాని ప్రాంతంలో అరిటితోటలు - షెడ్లు - వ్యవసాయ పరికరాలు తగలబడిపోతే మళ్లీ వైఎస్ జగన్ పై రుద్దారని గుర్తు చేశారు. ఎందుకు తగలబడిపోయిందనే కనీస విచారణ కూడా చేయకుండా ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అదే విధంగా మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే దీని వెనుక కూడా వైఎస్ జగన్ కుట్ర ఉందని పలుమార్లు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ జగన్ దే బాధ్యత అనే నీచమైన పద్ధతుల్లో వెళ్తున్నారన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/