ఏపీ మాజీ ముఖ్యమంత్రి కమ్ టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ అధికారపక్ష సభ్యులు విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన తప్పుల చిట్టాను విప్పి చూపిస్తున్న కొద్దీ.. బాబు ముఖంలో రంగులు మారుతున్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగున్నట్లుగా తనకు తాను కవర్ చేసుకున్న బాబుకు.. ఆయన బ్యాచ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు చురుకు పుట్టిస్తున్నాయి.
ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు.. బాబుపై విమర్శల వర్షం కురిపించే అంబటి రాంబాబు ఈ రోజు అసెంబ్లీ వేదిక మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనను ఏకిపారేశారు. ఐదేళ్లు సమర్థవంతమైన పాలన అందించినట్లుగా చంద్రబాబు..టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని.. అయితే అది తప్పన్నారు. సమర్థవంతమైన పాలన అందించినట్లుగా టీడీపీ వారు చెప్పుకోవటం సరికాదని.. ప్రజలు చెప్పాలన్నారు. 2019నాటికి పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం రాసుకొమ్మని బాబు సవాల్ విసిరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడేం చేశారో తెలుసుగా? అంటూ ఎద్దేవా చేశారు.
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు లాంటి సీనియర్ నేత ఊహకు అందని రీతిలో అనూహ్య విజయాన్ని తమకు ప్రజలు కట్టబెట్టారన్నారు. 151 సీట్లు వచ్చాయని.. అయినప్పటికీ విజయగర్వం తమకు నెత్తికి ఎక్కలేదన్నారు. ఐదేళ్ల క్రితం బెల్ట్ షాపుల రద్దుపై మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. దాన్ని అమలు చేయలేకపోయారని.. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నామన్నారు.
బెల్ట్ షాపులనే రద్దు చేయలేని ప్రభుత్వం ఎలాంటి పాలన చేసిందో ప్రజలు గడిచిన ఐదేళ్లలో చూశారన్నారు. తమ నాయకుడు జగన్ కు పదేళ్ల అనుభవం 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. నలభూఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న బాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.
అంబటి వ్యాఖ్యలపై అరుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మరింత ఘాటుగా మాట్లాడిన అంబటి.. మీ పార్టీ అధినేత మారాలి.. మీరు.. మీ నాయకుడు మారకపోతే తట్టులోలేరు.. గుర్తు పెట్టుకోండి.. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలని మనవి చేసుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తాను సభలో పనికి వచ్చే అంశాల్నే చెబుతున్నానని.. బాబు అంటే అనుభవజ్ఞుడని తాను కూడా అనుకుంటానని చెప్పారు. టీడీపీ సభ్యుల్ని చూస్తుంటే పరమానంద శిష్యులు గుర్తుకొస్తున్నారన్నారు.అసెంబ్లీలో వారి తీరు ఇలాగే ఉందన్నారు.