తన ఒక్కడి స్వార్థ ప్రయోజనాల కోసం ఇటు తెలంగాణలో అటు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు... సీఎం పదవికి అనర్హుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అక్రమాలు చేయడం - ఏదో రకంగా వాటి నుంచి బయటపడటం బాబుకు వెన్నుతోపెట్టిన విద్య అని ఆరోపించిన అంబటి...ఓటుకు నోటు కేసులో తాజాగా ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నుంచి బాబు తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ఉపయోగించిన ట్రిక్కులు వదిలిపెట్టి ఇపుడు ఒకే విషయాన్ని మదిలో ఉంచుకోవాలని చంద్రబాబుకు సూచించారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ జరిపిన వ్యవహారమంతా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరిగిందని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) చార్జ్ షీట్ లో పేర్కొన్నదని తెలిపారు. చంద్రబాబు పేరును చార్జిషీట్ లో దాదాపు 33 సార్లు ప్రస్తావించిందని, ఆయన వాయిస్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందని ప్రస్తావించారు. ఈ కుట్రకు ఎలాంటి వ్యూహం రచించింది... ఎవరెవరు పాత్రధారులు - సూత్రధారులనే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. అయితే అపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు - తెలంగాణ సీఎం కేసీఆర్ లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని రాజీపడ్డారని అంబటి మండిపడ్డారు. అయితే తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్ని సాక్ష్యాధారాలతో ఏసీబీ కోర్టును ఆశ్రయించడం తద్వారా కోర్టు విచారణకు ఆదేశించడంతో బాబులో వణుకు మొదలైందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెంకయ్య నాయుడు - కేసీఆర్ సహా ప్రధానమంత్రి రంగంలోకి దిగినా బాబును కాపాడలేరని అంబటి తేల్చిచెప్పారు.
అందుకే ఓటుకు నోటు పేరుతో తానే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశానని చంద్రబాబు అంగీకరించి...ఆ మేరకు కోర్టుకు తన వాంగ్మూలం ఇవ్వాలని అంబటి రాంబాబు చెప్పారు. అపుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వ్యక్తిగా బాబు గుర్తింపు పొందగలరని ఆయన సూచించారు. లేదంటే తప్పు చేసిన దొంగ తప్పించుకు తిరుగుతున్నారనే ముద్ర వేసుకోవాల్సి వస్తుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.