ఏపీ ప్రధాన విపక్షం.. వైకాపా ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను టార్గెట్ చేసిందా? తండ్రిని అడ్డం పెట్టుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తోందా? వాడుకుని వదిలేసే రాజకీయాలకు లోకేష్ కూడా తెరదీస్తున్నారని పేర్కొంటోందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఈ రోజు రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన వైకాపా నేత అంబటి రాంబాబు.. లోకేష్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. మంత్రి వర్గాన్ని శాపించే స్థాయికి లోకేష్ ఎదిగి పోయారని ఆయన విమర్శించారు. మంత్రులపై పెత్తనం చెలాయించడాన్ని లోకేశ్ మానుకోవాలని అన్నారు. తండ్రి చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని లోకేష్ రెచ్చిపోతున్నారని అన్న అంబటి.. టీడీపీ నిర్మాణం గురించి తెలుసుకోవాలని క్లాస్ ఇచ్చారు.
ఇటీవల సాక్షిలో వచ్చిన ఓ కథనంపై స్పందించిన లోకేష్. దానికి వివరణగా వైకాపా అధినేత జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. దీనిపై స్పందించిన అంబటి.. లోకేష్ పై విరుచుకుపడ్డారు. వాడుకొని వదిలేయడం - అవమానించడం చంద్రబాబుకు అలవాటేనని - ఇప్పుడు ఇదే అలవాటు లోకేష్ కు కూడా అబ్బిందని ఎద్దేవా చేశారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు మూలంగా ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారని కూడా ఈ సందర్భంగా అంబటి గుర్తు చేయడం విశేషం. అప్పుడు కూడా వదలి పెట్టని చంద్రబాబు.. ఆస్పత్రిలో రెస్ట్ తీసుకుంటున్న జూనియర్ తో అక్కడి నుంచే సెంటిమెంట్ పారించే ప్రచారం చేయించుకున్నారని దుయ్యబట్టారు.
ఇప్పుడు లోకేష్ ఓ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు మంత్రులను కించపరిచే హక్కే లేదని చెప్పారు. చౌకబారు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి లోకేష్ గెలవాలని సవాల్ విసిరారు. అప్పుడు గానీ, పాలిటిక్స్ టేస్ట్ ఏంటో తెలియదని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలను - మంత్రులను అవమానించడం సరికాదని లోకేష్ కు హితవు పలికారు. అసలు మంత్రి వర్గంతో లోకేష్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. చౌకబారు రాజకీయాలు - కుల రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటి నుంచైనా లోకేష్ తన పద్ధతి మార్చుకోవాలని అంబటి హితవు పలికారు. ఏదేమైనా లోకేష్ పై వైకాపా నాయకుల విమర్శలతో పాటు అటు అటు సాక్షి మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేక కథనాలు చూస్తుంటే లోకేష్ ను భారీగానే టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/